పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల కానున్న విషయం మన అందరికి తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో పవన్ కి జోడిగా కనిపించనుండగా ... ఇమ్రాన్ హాష్మి ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అర్జున్ దాస్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలో కనిపించనుండగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాల టికెట్ ధరలు భారీగా పెంచి విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజి సినిమా కూడా అత్యంత భారీ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవో విడుదల అయ్యి కూడా కొన్ని రోజులు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలో ఇప్పటికే ఈ మూవీ టికెట్ బుకింగ్స్ పెరిగిన ధరలతో ఓపెన్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ కూడా జనాల నుండి లభిస్తుంది. తాజాగా ఓజి సినిమా తెలంగాణ టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవో విడుదల అయింది.

దాని ప్రకారం చూసినట్లయితే ... ఓజి సినిమా సెప్టెంబర్ 24 వ తేదీన రాత్రి 9 గంటల ప్రీమియర్ షో లకు 800 రూపాయలుగా టికెట్ ధరలను ఖరారు చేశారు. ఇక ఈ సినిమా యొక్క టికెట్ ధరలను సెప్టెంబర్ 25 వ తేదీ నుండి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 100 రూపాయలను ,  మల్టీప్లెక్స్ థియేటర్లలో 150 రూపాయల వరకు పెంచుకునేందుకు వెసులుబాటును కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా జీవోను విడుదల చేసింది. పెరిగిన టికెట్ ధరలతో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ టికెట్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కారణంతో ఈ మూవీ కి మంచి టాక్ వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: