మామూలు ప్రజలు రోడ్లపై ఉండే టిఫిన్ సెంటర్లలో గానీ చిన్న చిన్న హోటల్ లలో గాని టిఫిన్ చేసినట్లయితే వాటిపై జీఎస్టీలు పెద్దగా వేయరు. ఎప్పుడైతే మనం స్టార్ హోటల్ లలోకి , ఏసీ హోటల్లోకి వెళ్లి టిఫిన్ చేస్తామో దానిపై దాదాపుగా జిఎస్టిని వేస్తూ ఉంటారు. అలా జిఎస్టి వేయడంతో టిఫిన్ ధర కూడా చాలా వరకు పెరుగుతూ ఉంటుంది. ఇక సాధారణమైన ప్రజలు , మధ్య తరగతి ప్రజలు , ఏసి హోటల్ లలో , స్టార్ హోటల్ లలో టిఫిన్ చేయడానికి అసలు ఆసక్తి చూపించారు. అందుకు ప్రధాన కారణం దానికి అత్యధిక డబ్బులు ఖర్చు కావడమే. ఇక సాధారణమైన ప్రజలు ఎక్కువ శాతం టిఫిన్లను రోడ్లపై ఉండే బండిలపై , చిన్న చిన్న హోటల్ లలో చేస్తూ ఉంటారు.

దానితో వారి టిఫిన్ ఖర్చు చాలా తక్కువగా అవుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా జనసేన ఎమ్మెల్యే అయినటువంటి కొలతల రామకృష్ణ జీఎస్టీ సంస్కరణ పై మాట్లాడుతూ  ... దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా తినే ఇడ్లీ , దోస , వడ పై ఐదు శాతం పన్ను విధిస్తున్నట్లు ఆయన చెప్పాడు. అలాగే ఆ పన్నును తొలగించాలి అని ఆయన సూచన చేశాడు. చపాతి , పరోటా , పన్నీర్ పై పన్ను తొలగించినందుకు నా ఇడ్లీ , దోస , వడ పై కూడా పన్ను తొలగించాలి అని ఆయన సూచించారు. దానిపై ఉప సభాపతి రఘు రామ కృష్ణ రాజు చక్కని చూసే చేశారు అని ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

ఇక జనసేన ఎమ్మెల్యే అయినటువంటి కొలతల రామకృష్ణ వ్యాఖ్యలపై కొంత మంది స్టార్ హోటల్ లో , పెద్ద పెద్ద ఏసి హోటల్ లలో టిఫిన్ చేసినప్పుడు మాత్రమే టిఫిన్ పై జిఎస్టి లను విధిస్తారు. అదే చిన్న చిన్న బండిలపై , అలాగే చిన్న చిన్న హోటల్ లలో ఇడ్లీ , వడ , దోసా లాంటి టిఫిన్ చేస్తే వాటిపై జిఎస్టి వేయరు. ఆయన బయట తినడు కావచ్చు అందుకే అతనికి తెలియదు అనే కామెంట్ చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద స్టార్ హోటల్ లలో ఏ పదార్థం తిన్నా కూడా దానిపై జిఎస్టిని విధిస్తారు అని కూడా కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: