
ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా ఆగడు సినిమా దర్శకుడు అయినటువంటి శ్రీను వైట్ల మాట్లాడుతూ ... మహేష్ బాబు గారితో నేను మొదట రూపొందించిన దూకుడు సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన నాకు మరో సినిమా చేసే అవకాశం కూడా ఇచ్చాడు. దానితో నేను ఒక కథను రెడీ చేశాను. అది అద్భుతంగా వచ్చింది. దానిని మహేష్ బాబు గారికి వినిపించాను. ఆయనకు కూడా అది అద్భుతంగా నచ్చింది. కానీ మా నిర్మాత మాత్రం ఆ సమయంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాడు. నేను మహేష్ బాబు కోసం రాసుకున్న కథకు భారీ బడ్జెట్ అవసరం ఉంటుంది. దానితో మహేష్ గారు కూడా అంత బడ్జెట్ తో అవసరమా ..? నిర్మాత కష్టాల్లో ఉన్నాడు అని అన్నాడు. దానితో నేను సింపుల్ గా ఓ కథ రెడీ చేశాను ... అదే ఆగడు. ఆ మూవీ ని ఎంతో ఇంట్రెస్ట్ గా తీశాను. కానీ జనాలకు నచ్చలేదు. నేను కాస్త కష్టం అయినా మొదట అనుకున్న స్టోరీ తో సినిమా తీసుకుంటే అద్భుతమైన విజయం సాధించి ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను అని శ్రీను వైట్ల ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.