పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితమే హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అపజయాన్ని సొంతం చేసుకుంది. ఇక హరిహర వీరమల్లు లాంటి అపజయం తర్వాత పవన్ కళ్యాణ్ "ఓజి" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ చాలా ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి.

మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క టికెట్ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఇప్పటివరకు ఫ్రీ సేల్స్ ద్వారానే దాదాపు 35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కినట్లు తెలుస్తోంది.  ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉంది. దానితో ఈ మూవీ విడుదలకు ముందు ఫ్రీ సేల్స్ తోనే పెద్ద ఎత్తున గ్రాస్ కలెక్షన్లను దక్కించుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.  ప్రస్తుతానికి ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాకు గనక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేస్తుంది అని కూడా చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: