టాలీవుడ్ యంగ్ నటలలో తేజా సజ్జ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఈయన కొంత కాలం క్రితం హనుమాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో తేజ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

హనుమాన్ లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత తేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మీరాయ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను ఇప్పటికే వసూలు చేసింది. ఈ మూవీ కి ఇప్పటికి కూడా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ సూపర్ సాలిడ్ రికార్డును సొంతం చేసుకుంది. 

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేశారు. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటివరకు ఈ మూవీ కి సంబంధించిన 1.75 మిలియన్ టికెట్లు బుక్ మై షో యాప్ లో సేల్ అయినట్లు , ఇప్పటివరకు తెలుగు మూవీలలో హైయెస్ట్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయిన మూవీల లిస్టులో ఈ సినిమా టాప్ 10 లో నిలిచినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో మీరాయ్ సినిమా అద్భుతమైన రికార్డును సృష్టించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: