- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్  ప్రీక్వెల్ కాంతారా: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. హైప్‌ను నెక్స్ట్ లెవల్ లోకి తీసుకెళ్తు సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో మ్యాసీవ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను టీం అనౌన్స్ చేసింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు.


ఎన్టీఆర్ హాజరుకావడంతో సినిమా ప్రీ-రిలీజ్ ప్రమోషన్‌కి మరింత బలాన్ని చేకూర్చనున్నారు. ఇది నిజంగానే కాంతారా తెలుగు వెర్ష‌న్ కు మంచి బూస్ట‌ప్ లాంటి వార్త అని చెప్పాలి. మైథాలజీ, రీజినల్ ట్రెడిషన్స్ ని అద్భుతంగా ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా ఉండబోతోంది. అక్టోబర్ 2వ తేదీకి కౌంట్‌డౌన్ మొదలుకావడంతో ‘కాంతార: చాప్టర్ 1’ ఈ ఫెస్టివల్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. కాంతార చాప్ట‌ర్ 1 మ‌రోసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్షేష‌న‌ల్ రికార్డులు క్రియేట్ చేస్తుంద‌న్న అంచ‌నాలు భారీగా ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: