
అయితే, ఇప్పుడు ఈ రికార్డును సవాలు చేసే మరో భారీ సినిమా రాబోతోంది. అది నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న “అఖండ 2”. “అఖండ” సినిమా అప్పట్లో చూపిన సెన్సేషనల్ రన్, భారీ కలెక్షన్లు, మాస్ రెస్పాన్స్ ఇప్పటికీ గుర్తుండి పోయేలా ఉన్నాయి. అందుకే దాని సీక్వెల్‌కి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక “అఖండ 2” పై ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లో హైప్ నెలకొంది. బాలయ్య యాక్షన్, బోయపాటి టేకింగ్, మ్యూజిక్, మరియు విజువల్ గ్రాండియర్ తో ఈ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేస్తుందన్న నమ్మకం ఉంది.
అఖండ 2 సినిమా హిట్ అయితే, “ఓజీ” రికార్డును బ్రేక్ చేయడం కష్టం కానే కాదు. ముఖ్యంగా డిసెంబర్‌లో రిలీజ్ ప్లాన్‌తో వస్తున్న ఈ సినిమా పండుగ సీజన్ అడ్వాంటేజ్‌ను కూడా అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి, “ఓజీ” హైయెస్ట్ గ్రాసర్ టైటిల్‌ను “అఖండ 2” సవాలు చేస్తుందా? లేక పవన్ కళ్యాణ్ సినిమా రికార్డు ఈ ఏడాది చివరిదాకా నిలిచిపోతుందా ? అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ అభిమానులంతా ఈ బాక్సాఫీస్ పోరును ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు