
ఆ తర్వాత 1974లో వీరు వియ్యంకులుగా మారారు. ఏవీ సుబ్బారావు కుమారుడు సత్య భూషణరావు, ఏఎన్ఆర్ రెండవ కుమార్తె నాగసుశీల వివాహం 1974 జూన్ 10వ తేదీన జరిగింది. అప్పట్లోనే మద్రాసులోని అబట్స్ బరీ ప్రాంతంలో చాలా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి, ఏఎన్ఆర్ కు బెస్ట్ ఫ్రెండ్స్ తమిళ స్టార్ హీరో శివాజీ గణేషన్, మాజీ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. నాగసుశీల, సత్య భూషణ్ కి పుట్టిన కుమారుడే ఇప్పటి యంగ్ హీరో సుశాంత్. 50 ఏళ్ల క్రితం జరిగిన పెళ్లికి సంబంధించి అప్పట్లో ప్రచురించిన ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతోంది.
ఏవీ సుబ్బారావు, ఏఎన్ఆర్ వియ్యంకులు అయిన తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ఆలుమగలు చిత్రం 1977 మంచి విజయాన్ని అందుకున్నది. మళ్లీ ఏఎన్ఆర్ తో నాయకుడు - వియ్యంకుడు అనే చిత్రాన్ని 1980లో నిర్మించారు.1965లో జయలలిత మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైన చిత్రం మనుషులు- మమతలు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది జయలలిత. జయలలిత చివరి సినిమా నాయకుడు - వీయకుడు చిత్రాన్ని కూడా ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్ నిర్మించింది. ఇందులో హీరోగా ఏఎన్నార్ లో ఉన్నారు.