
అయితే, ఈ ఆనంద సమయంలోనే కొంతమంది సోషల్ మీడియా యూజర్లు పాత రూమర్స్‌ని తిరిగి వెలికి తీస్తున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక మందనకంటే ముందే ఒక హీరోయిన్‌ను ప్రేమించాడట. ఆమె మరెవరో కాదు, పెళ్లిచూపులు సినిమాలో ఆయనతో జోడీగా నటించిన రీతు వర్మ. ‘పెళ్లిచూపులు’ సినిమాలో విజయ్ మరియు రీతు వర్మ మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. అప్పట్లోనే వీళ్లిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ ఇద్దరూ ఆ సమయంలో ఎప్పుడూ ఆ వార్తలను నిరాకరించారు. ఇప్పుడు మాత్రం రష్మికతో విజయ్ నిశ్చితార్థం చేసుకున్నాడన్న వార్తల మధ్య, ఆ పాత గాసిప్స్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది కావాలనే రష్మికను బాధపెట్టేలా “రీతు వర్మ విజయ్ దేవరకొండకు సరైన జోడీ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరికొందరు ఏకంగా “పెళ్లిచూపులు సమయంలో విజయ్ - రీతు వర్మకు ప్రపోజ్ చేశాడట, కానీ ఆమె ‘ఇలాంటి రిలేషన్‌లో ఆసక్తి లేదు’ అని చెప్పి రిజెక్ట్ చేసిందట” అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ రూమర్స్‌కు ఎలాంటి ఆధారం లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ కథనం పెద్ద స్థాయిలో వైరల్ అవుతోంది. ఇది చూసి విజయ్ దేవరకొండ అభిమానులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. “విజయ్ దేవరకొండ ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే ఎందుకింత నెగిటివిటీ చూపిస్తున్నారు? ఇలాంటి అబద్ధపు వార్తలు ఎందుకు?” అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మన హీరో ఇమేజ్‌ని దెబ్బతీయడానికి కావాలనే కొంతమంది ఇలా నకిలీ రూమర్స్ పుట్టిస్తున్నారు” అని ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న విషయం అయినా పెద్ద సంచలనంగా మారిపోతుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా నిశ్చితార్ధం వార్త కూడా అదే తరహాలో ఇప్పుడు ఫ్యాన్ బేస్ ఎమోషన్, సోషల్ మీడియా ట్రోల్స్, పాత రూమర్స్ అన్నీ కలిసిపోయిన ఒక పెద్ద చర్చగా మారింది.ఏదేమైనా, అభిమానులు మాత్రం ఒకే మాట చెబుతున్నారు —“విజయ్ దేవరకొండ అంటే స్టైల్ మాత్రమే కాదు, లాయల్టీ కూడా ఉంది! ఆయన ఎంచుకున్నది రష్మిక అయితే, ఆమెదే మన హీరోకు సరైన జోడీ!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!