నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటివరకు తన కెరియర్లో చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా రిజెక్ట్ చేసిన మూవీలలో కొన్ని మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే బాలకృష్ణ సోదరుడు అయినటువంటి హరి కృష్ణ పలు సినిమాలలో హీరో గా నటించిన మంచి విజయాలను అందుకున్నాడు. అలాగే హరి కృష్ణ కొన్ని సినిమాల్లో కీలక పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఓ మూవీ లో తన సోదరుడు అయినటువంటి హరి కృష్ణ నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకు బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏది ..? ఎందుకు రిజెక్ట్ చేశాడు ..? బాలకృష్ణ రిజక్ట్ చేసిన ఏ సినిమాతో హరి కృష్ణ కు మంచి విజయం దక్కింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం హరి కృష్ణ , వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన సీతయ్య అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సౌందర్య , సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా హరి కృష్ణ కు , వై వి ఎస్ చౌదరి కి మంచి గుర్తింపు దక్కింది. ఇది ఇలా ఉంటే మొదట ఈ సినిమాలో హరి కృష్ణ ను కాకుండా బాలకృష్ణ ను హీరో గా తీసుకోవాలి అని వై వి ఎస్ చౌదరి అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ కలిసి కథను కూడా వివరించాడట. కానీ బాలకృష్ణ ఆ సమయంలో చెన్న కేశవ రెడ్డి , పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాలో నటించలేను అని చెప్పాడట. దానితో వై వి ఎస్ చౌదరి అదే కథను హరి కృష్ణ కు వినిపించగా ఆయన ఆ సినిమాలో హీరో గా నటించాడట. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన మూవీ తో హరి కృష్ణ కు అద్భుతమైన విజయం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: