
ప్రగతి కేవలం అతిథి పాత్రలోనే కాదు, తెర వెనక కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేశారు. పౌరాణిక నేపథ్యాన్ని కలిగి ఉండే ఈ చిత్రానికి ఆమె రూపొందించిన వస్త్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రతి పాత్రకు సరిగ్గా సరిపోయేలా, వారి భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆమె డిజైన్లు రూపొందించారు. గ్రామీణ నేపథ్యం నుంచి రాచరికపు లుక్ వరకూ ఆమె టచ్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో రిషబ్ కుమారుడు రణవిత్ కూడా కనిపించాడు. ఒకే ఫ్రేమ్ లో తండ్రి, కుమారుడు కనిపించడం ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ ట్రీట్ లా మారింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ… తన భార్య ప్రగతి సపోర్ట్ లేకపోతే ఈ సినిమా పూర్తి చేయడం అసాధ్యమని భావోద్వేగంగా చెప్పాడు. షూటింగ్ సమయంలో ఆమె దేవుడిని వేడుకునేది అని, ఎప్పటికీ ఆమె మద్దతు మరవలేనని తెలిపాడు.
రిషబ్, ప్రగతి ప్రేమ కథ కూడా చక్కగా సాగింది. మొదటిసారి సినిమా సెట్స్ లో కలుసుకున్న ఈ జంట, తర్వాత ఫేస్ బుక్ ద్వారా స్నేహితులయ్యారు. ఆ స్నేహం ప్రేమగా మారి… కొన్ని అడ్డంకుల తర్వాత, పెద్దల సమక్షంలో 2017లో వివాహ బంధంలోకి ప్రవేశించారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు.కాంతార చాప్టర్ 1 విజయం వెనుక ఉన్న అసలైన బలమైన చేతి పేరు – ప్రగతి శెట్టి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెరపై రిషబ్ మెరిసినంతగా, తెరవెనుక ప్రగతి కృషి కూడా వెలకట్టినది!