టాలీవుడ్ యువ నటుడు విజ య్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లే దు . ఇకపోతే విజయ్ దేవరకొండ హీరో గా కెరియర్ ను మొదలు పెట్టాక మం చి విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో ఈయనకు చాలా తక్కువ కాలం లోనే మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఈయన నటించిన సినిమాలు వరుస పెట్టి బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఆఖరు గా ఈయన కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది.

ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు మంచి టాక్ కూడా రావడంతో ఈ సినిమా చేసే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ చివరగా ఈ సినిమా కూడా విజయ్ కి నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ , రాహుల్ సంక్రుతియన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో.గా నటిస్తున్నాడు. గతంలో విజయ్ , రాహుల్ కాంబో లో రూపొందిన టాక్సీ వాలా సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో పొందుతున్న రెండవ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

విజయ్ , రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు రౌడీ జనార్ధన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క పూజ కార్యక్రమాలను అక్టోబర్ 11 వ తేదీన నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ప్రస్తుతం విజయ్ ఓ సినిమాలో హీరో గా నటిస్తూనే మరో సినిమాను కూడా మరి కొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd