
సినిమాలో ఆమె నటన, అందం, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో అయితే "రుక్మిణి వసంత్ నెక్స్ట్ నేషనల్ క్రష్" అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అభిమానులు ఆమెను రష్మిక మందన్నాతో పోల్చుతున్నారు. అయితే “రష్మిక కాలి గోటికి కూడా సరిపోదు రుక్మిణి వసంత్" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు రష్మిక ఫ్యాన్స్ . “హీరోయిన్‌గా ఒక స్థాయికి ఎదగాలంటే కేవలం అందం సరిపోదు, టాలెంట్, వర్క్ ఎథిక్, డెడికేషన్ ఉండాలి. రష్మిక మందన్నా ఆ ప్రతిభతోనే నేషనల్ లెవెల్ స్టార్ అయింది” అంటున్నారు.
రష్మిక ఖాతాలో ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు, పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్, అనిమల్, కుబేర,ఛావా వంటి భారీ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆమె కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా తనకంటూ బలమైన ఫ్యాన్ బేస్ సృష్టించుకుంది. అందుకే అభిమానులు రుక్మిణి వసంత్ ను రష్మికతో పోల్చడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రుక్మిణి వసంత్ అభిమానులు మాత్రం “ఇది కేవలం మొదలు మాత్రమే, రుక్మిణి ఇంకా చాలా దూరం వెళ్లనుంది” అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 విజయం తర్వాత ఆమెకు వచ్చే ఆఫర్లు చూసినా, టాప్ హీరోయిన్ రేసులో ఆమె ఎంట్రీ ఖాయం అన్నట్లే కనిపిస్తోంది.
అయితే, రష్మిక స్థాయి చేరడం అంత ఈజీ కాదు. ఎందుకంటే రష్మిక తన కెరీర్‌లో ప్రతి అడుగూ కచ్చితమైన ప్లానింగ్‌తో వేసింది. విభిన్నమైన రోల్స్ చేస్తూ, సౌత్ నుండి నార్త్ వరకు ప్రజల్లో పాపులర్ అయ్యింది.ఇక రుక్మిణి వసంత్ విషయానికి వస్తే — ఆమె కాంతార ద్వారా ఒక్కసారిగా హైలైట్ అయినప్పటికీ, ఇంకా ఆమెకు కావలసిన స్థిరమైన పాపులారిటీని నిలబెట్టుకోవాలి. ఒక సక్సెస్ తో మాత్రమే రష్మిక స్థాయిని టచ్ చేయడం సాధ్యం కాదు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి తలకిందులుగా తపస్సు చేసిన సరే — రుక్మిణి వసంత్ .. రష్మిక మందన్నా స్థాయిని ఇప్పటికీ టచ్ చేయలేదని, ఆ గ్యాప్ భర్తీ కావడానికి ఇంకొంత టైమ్ పడుతుందని చెప్పొచ్చు. కానీ ఈ అమ్మాయి టాలెంట్ చూస్తుంటే, భవిష్యత్తులో టాప్ లీగ్‌లోకి ఎంటర్ కావడం ఖాయం అనిపిస్తోంది.