
అయితే ఈ వ్యాఖ్యలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. “జాన్వీ బోల్డ్ అని తెలుసు కానీ ఇంత బోల్డ్‌గా మాట్లాడుతుందని అనుకోలేదు”, “ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలుగు ఆడియన్స్ అంగీకరించరు”, “జాన్వీ కపూర్‌కి బాలీవుడ్‌నే సరిపోతుంది, టాలీవుడ్‌కి కాదు” అంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా కొందరు సినీ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ — “ఒక నటి తన భావాలను వ్యక్తం చేయడంలో తప్పేమీ లేదు కానీ ఆ భావాలను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కుటుంబ విలువలకు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే వారు. కాబట్టి జాన్వీ చేసిన వ్యాఖ్యలు కొంతమంది మనసుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించాయి” అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక అభిమానుల మధ్య కూడా చర్చ ముదురుతోంది. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తూ ..“జాన్వీ నిజం మాట్లాడింది. నటనలో బోల్డ్‌నెస్‌కి కూడా స్థానం ఉంది” అని చెప్పుతున్నారు. మరికొందరు మాత్రం “ఇలాంటి మాటలతో ఆమె ఇమేజ్ దెబ్బతింటుంది” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ మధ్య కూడా జాన్వీ కపూర్ తన పనిపై ఫోకస్ చేసి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌తో కలిసి ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూట్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలనే పట్టుదలతో పనిచేస్తోంది. మొత్తానికి, జాన్వీ కపూర్ చేసిన బోల్డ్ కామెంట్స్ ఆమెపై కొంత విమర్శలను తెచ్చిపెట్టినా, అదే సమయంలో ఆమె నిజాయితీగా చెప్పిన మాటలుగా కొందరు సపోర్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ బోల్డ్ ఇమేజ్‌ను పాజిటివ్‌గా మార్చి, తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించగలదో చూడాలి..??