"దీపికా పదుకొనే"..బాలీవుడ్‌ బ్యూటీ  — అందం, అభినయం, గ్లోబల్‌ రేంజ్‌లో గుర్తింపు అన్నీ కలిపిన స్టార్‌ హీరోయిన్‌. హాలీవుడ్‌ సినిమాలు కూడా చేసిన ఈ స్టార్‌ భారతీయ సినిమాకి ఒక ప్రతీకగా నిలిచింది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా పదుకొనే.. "సెక్స్‌" గురించి ఘాటుగా, నిర్భయంగా మాట్లాడిన తీరు నెట్టింట చర్చనీయాంశమైంది. ఆమె చెప్పిన మాటలు కొందరికి షాక్‌ ఇచ్చి, మరికొందరిని ఆలోచనలో పడేశాయి. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ — “సెక్స్‌ అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నేను పెళ్లికి ముందు చేసుకుంటానా, లేక తర్వాత చేసుకుంటానా అన్నది నా ఇష్టం. ఎవరితో చేస్తానన్నది కూడా నా మనసు, నా భావాలపై ఆధారపడి ఉంటుంది. ఒక అబ్బాయిని ప్రేమిస్తే, లేకపోతే అతనిపట్ల ఆకర్షితురాలినై ఉంటే, ఆ అనుభూతి కూడా నా హక్కు. నా జీవితాన్ని ఎవరూ నియంత్రించలేరు” అని స్పష్టం చేసింది.


దీపికా ఇంకా మాట్లాడుతూ —“మీడియా ఏం రాస్తుందో, ఎవరు ఏమంటారో పట్టించుకుంటూ పోతే జీవితం ముందుకు సాగదు. నా జీవితం నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. ఇతరులతో పోల్చుకోవడం, వేరొకరి అభిప్రాయాల కోసం మారిపోవడం నేను చేయను” అని ఘాటుగా చెప్పింది. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్‌ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు దీపికా మాటలను మహిళా స్వేచ్ఛకు మద్దతుగా అభినందిస్తుండగా, మరికొందరు మాత్రం “ఇది పూర్తిగా బూతు వ్యాఖ్యలు” అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు “ఇంత పెద్ద స్టార్‌ సెలబ్రిటీ ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గు పడాల్సిన  విషయం” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు “నీ టైమ్‌ బ్యాడ్‌, అందుకే ఇలా మాట్లాడుతున్నావ్‌” అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో “దీపికా బూతు పురాణం” పేరుతో మీమ్స్‌, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే మరో వర్గం ప్రేక్షకులు మాత్రం దీపికా మాటలకు సమర్థన తెలుపుతున్నారు. “సెక్స్‌ అనేది వ్యక్తిగత హక్కు. దీపికా నిజం మాట్లాడింది. ఆమె చెప్పినది సత్యం, ధైర్యంగా మాట్లాడినందుకు అభినందించాలి” అంటున్నారు.



ఈ ఘటనతో దీపికా పదుకొనే మళ్లీ ఒకసారి సోషల్‌ మీడియా హాట్‌ టాపిక్‌గా మారింది. కొంతమంది ఆమెను విమర్శిస్తుంటే, మరికొందరు ఆమెను ‘వాయిస్‌ ఆఫ్‌ మోడర్న్‌ ఉమెన్‌’ అంటూ ప్రశంసిస్తున్నారు.ఇక అభిమానులు మాత్రం “దీపికా ఈ వ్యాఖ్యలతో ఎవరినీ తప్పుపట్టలేదు, తన ఆలోచన చెప్పింది అంతే” అని రక్షణగా నిలుస్తున్నారు.ఏదేమైనప్పటికీ — దీపికా పదుకొనే మాటలు ఇప్పుడు నెట్టింట సంచలనానికి కారణమవుతున్నాయి.ఒకవైపు స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు అంటూ అభినందనలు వస్తుంటే, మరోవైపు బూతు సంస్కృతి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ఎంతదాకా వెళ్తుందో చూడాలి కానీ — ప్రస్తుతం దీపికా పేరు మళ్లీ సోషల్‌ మీడియా లో దుమ్మురేపుతోంది అనేది మాత్రం ఫాక్ట్‌!

మరింత సమాచారం తెలుసుకోండి: