సౌత్ ఇండియ‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒకప్పుడు దర్శకుడిగా అద్భుతమైన స్థాయి సాధించిన పేరు ఎ.ఆర్. మురుగదాస్‌. రమణ, గజిని, ఠాగూర్‌, తుపాకీ, కత్తి వంటి సినిమాలతో ఆయన సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా స్టార్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కథలో పట్టు, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం, మాస్ అండ్ క్లాస్‌కి బ్యాలెన్స్‌ ఇవ్వడంలో మురుగదాస్‌దే ప్రత్యేకత. కానీ ప్రతి కెరీర్‌లో ఎత్తుపల్లాలు తప్పవు. స్పైడర్‌, సికందర్‌, దర్బార్‌ వంటి సినిమాలు వరుసగా ఫెయిల్‌ కావడంతో ఆయన కెరీర్ గాడి త‌ప్పేసింది. వ‌రుస ప్లాపుల త‌ర్వాత మురుగదాస్‌ ప్రవర్తన కూడా చర్చనీయాంశమైంది. ముందెన్నడూ మీడియాకు దూరంగా ఉండే ఆయన, అకస్మాత్తుగా తన సినిమాలు ఆడకపోవడానికి ఇతరులనే కారణమని చెప్పడం మొదలుపెట్టాడు.


మ‌రీ ముఖ్యంగా ‘సికందర్‌’ సినిమాకి సంబంధించిన వ్యాఖ్యలు బాగా హాట్‌టాపిక్ అయ్యాయి. సినిమా రిలీజ్‌కి ముందు హీరో సల్మాన్‌ ఖాన్‌ను ఆకాశానికి ఎత్తేసిన మురుగదాస్‌, సినిమా డిజాస్టర్‌ కాగానే మొత్తం బాధ్యత సల్మాన్‌ మీదకు నెట్టేశాడు. ఆయన లేటుగా సెట్స్‌కి రావడం వల్ల, పగటి సీన్లు రాత్రి ఎఫెక్ట్‌లో తీయాల్సి రావడం వల్ల‌ సినిమా స‌రిగా ఆడ‌లేద‌న్న‌ట్టుగా చెప్పడం మరింత విమర్శలకు దారితీసింది.


ఇదంతా విన్న సల్మాన్‌ కూడా మౌనం వహించలేదు. మురుగదాస్‌ షూటింగ్‌లో చేసిన నిర్లక్ష్యం, చివర్లో సినిమా పూర్తయ్యేలోపు సెట్‌ను వదిలేసి వెళ్లిపోయిన విషయాలను బహిరంగంగా చెప్పేశాడు. అంతేకాదు, "ఆయన వదిలేసి వెళ్లి తీసిన ‘మదరాసి’ బ్లాక్‌బస్టర్‌ అయిందట" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ సంఘటనతో మురుగదాస్‌ ఇమేజ్‌కి గట్టి దెబ్బ తగిలింది. ఒకప్పుడు అందరి అభిమానాన్ని పొందిన ఈ దర్శకుడు, ఇప్పుడు మళ్లీ పాత గౌరవం తెచ్చుకోవాలంటే కంటెంట్‌పైనే దృష్టి పెట్టి, తన సైలెంట్‌ ఇమేజ్‌ని తిరిగి పొందాల్సిన అవసరం ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: