హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు మూవీలు అద్భుతమైన డామినేషన్ను చూపిస్తున్నాయి. ఇప్పటివరకు హిందీ భాషలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీలలో అత్యధిక సినిమాలు తెలుగు మూవీలే ఉన్నాయి. మరి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీలు ఏవి ..? అందులో ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాం.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 830.10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 మూవీ 511 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. యాష్ హీరోగా రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ 435.2 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా 295.14 కోట్ల కలెక్షన్లను వసులు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 276.86 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది. రజినీ కాంత్ హీరోగా రూపొందిన రోబో 2.0 సినిమా 199.55 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఆరవ స్థానంలో నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా రూపొందిన కాంతారా చాప్టర్ 1 సినిమా 157.17 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏడవ స్థానంలో నిలిచింది. ఈ మూవీ తాజాగా విడుదల అయింది. ఈ మూవీ మరికొన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ముందు ప్లేస్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ 153.80 కోట్ల కలెక్షన్లను చేసి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో మూవీ 150 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి పార్ట్ 1 మూవీ 18.7 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో కొనసాగుతుంది. టాప్ టెన్ లో ఏడు సినిమాలు తెలుగు ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: