ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం కృతిశెట్టి పేరు ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మనందరికీ తెలిసిందే .. ‘ఉప్పెన’ సినిమాతో కృతిశెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన, అందం అభిమానులని కట్టిపడేసింది. ఈ సినిమాతోనే ఆమె తనదైన స్టైల్, అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ తరువాత వరుసగా పలు సినిమాలు చేస్తూ తన కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తోంది. ఆమె నటించిన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా, కృతిశెట్టి కి మాత్రం ఆఫర్లు ఆగడం లేదు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ జనాలని కృతి శెట్టి ది మోస్ట్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న అవకాశాలు ఎలా వస్తున్నాయ్..? ఇదే విషయంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.

ఇక తాజాగా కృతిశెట్టికి బాలీవుడ్ నుండి కూడా ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా తనయుడు హీరోగా నటిస్తున్న సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని బాలీవుడ్ మీడియా హౌజ్‌లు కూడా ఈ వార్తను ప్రచురించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే తాజాగా ఈ ఆఫర్ మరో మలుపు తిరిగింది. కృతిశెట్టి ఆ ప్రాజెక్ట్‌లో ఇక భాగం కాదని సమాచారం అందుతుంది. ఈ ఆఫర్ “ఏదో కలలా వచ్చింది కానీ, అది నిజం కాలేదు” అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే “బాలీవుడ్ స్పీడ్, ప్రెజర్ తట్టుకోలేక ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చేసింది” అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో నెటిజన్లు “ఎన్నోసార్లు కృతి కి అదృష్టం ఇంటి గుమ్మం దాకా వచ్చి వెనక్కి తిరిగి వెళ్తుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం కృతిశెట్టి టాలీవుడ్‌లో, కోలీవుడ్ లో  పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. మరోవైపు, బాలీవుడ్ ఎంట్రీ విషయమై ఆమె నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో నెటిజన్లు ఆమె తదుపరి అడుగుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి — కృతిశెట్టి బాలీవుడ్ ఎంట్రీ నిజమేనా? లేక కేవలం రూమర్ మాత్రమేనా? అనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ఓ హీరోయిన్ కి కమర్షియల్ గా ఎదగాలి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: