ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కొన్ని వివాదాలు ఉంటాయి. ఇక సెలబ్రిటీల విషయంలో వివాదాలకు కొదువే ఉండదు. అయితే తాజాగా ఇలాంటి వివాదాలే ఎదుర్కొంటున్నారు దుల్కర్ సల్మాన్.. మలయాళ నటుడు అయినప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ఈడీ కేసుల్లో ఇరుక్కున్న సంగతి కూడా తెలిసిందే.ఈ నేపథ్యంలోనే దుల్కర్ సల్మాన్ జీవితం గురించి పలు రూమర్లు తెరమీద వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రూమర్ల గురించి తాజాగా డైరెక్టర్ అలిప్పీ అష్రఫ్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.. దుల్కర్ సల్మాన్ నిర్మించిన కొత్తలోక సినిమా రికార్డులు సృష్టించినప్పటికీ ఆ ఆనందం లేకుండానే చేశారు. ఆయన జీవితాన్ని ఎన్నో వివాదాలు చుట్టు ముడుతున్నాయి.. దుల్కర్ సల్మాన్ జీవితంపై మచ్చ పడేయాలని చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన్ని ఎన్నో ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి.

అన్నింటికంటే ముఖ్యంగా తన తండ్రి అనారోగ్యం ఆయనకు పెద్ద సమస్యగా మారింది. కానీ ఆ దేవుడి దయ వల్ల మమ్ముట్టి పూర్తి ఆరోగ్యంతో బయటపడ్డారు. ఇక తండ్రి కోలుకున్నాడని ఆనందపడేలోపే ఆయన జీవితాన్ని చీకటిమయం చేయాలని చూస్తున్నారు కొంతమంది. దుల్కర్ జీవితంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. అందులో ఒకటి నిత్య మీనన్ తో ఎఫైర్.అసలు నిత్యామీనన్ తో ఎలాంటి ఎఫైర్ లేదు. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. ఈ విషయాన్ని నిత్య చాలా సందర్భాల్లో చెప్పి వారి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని కొట్టి పారేసింది. అలాగే దుల్కర్ తనకి మంచి ఫ్రెండ్ అని, తనని కలిసినప్పుడల్లా భార్య పిల్లల గురించి చెబుతారని, భార్యపై ఎంత ప్రేమ ఉందో ప్రతిసారి బయటపెడతాడని క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇక ఈ మధ్యకాలంలో దుల్కర్ సల్మాన్ పై అక్రమ రవాణా కేసులు వినిపిస్తున్నాయి. ఆయన భూటాన్ నుండి  అక్రమంగా కార్లు రవాణా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మమ్ముట్టికి కార్ల పిచ్చి ఎంత ఉందో అంతకంటే రెట్టింపు కార్ల పిచ్చి దుల్కర్ కి ఉంది.

ఇక ఈ మధ్యకాలంలో ల్యాండ్ రోవర్ కారుకు సంబంధించి ఈడి,కోర్టు సమస్యలు అంటూ దుల్కర్ ఇబ్బందులో పడ్డారు. ఇక దుల్కర్ నటించిన వరనే ఆవశ్యముండ్ అనే సినిమాలో సురేష్ గోపి ఓ కుక్కను ప్రభాకరా అని పిలవడం వివాదాస్పదమైంది.ఎందుకంటే ఎల్ టీటిఈ నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకర్ ని కావాలనే సినిమాలో ఓ కుక్కకి పేరు పెట్టి అవమానించారని మండిపడ్డారు. కానీ ఈ పేరుని పట్టణ ప్రవేశం అనే ఓల్డ్ మూవీ నుండి తీసుకున్నారని చెప్పినా కూడా వినలేదు. దాంతో ఈ వివాదాన్ని అక్కడితో ఆపేయడానికి దుల్కర్ సల్మాన్ బయటికి వచ్చి క్షమాపణలు చెప్పారు. ఇక దుల్కర్ సైలెంట్ గా ఉన్నా కూడా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. మోహన్ లాల్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వస్తే తండ్రి కొడుకులు ఇద్దరికీ మండుతుందని,తన తండ్రి కి రాకుండా మోహన్ లాల్ కి వచ్చేసరికి దుల్కర్ దాన్ని ఓర్చుకోలేకపోతున్నాడని రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. కానీ మోహన్లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని వీళ్ళు ఆనందించే లోపే వాళ్ళ ఇంటిని ఈడీ వాళ్ళు చుట్టూ ముట్టడంతో ఆనందం ఆవిరైపోయింది ఇది ముందుగా తెలుసుకోవాలి.

అంతేకాదు దుల్కర్ ని ఈడీ వాళ్లు ప్రశ్నిస్తే కన్నీళ్లు పెట్టుకున్నారని,జైలుకు వెళ్లాల్సి వస్తుందని, బుల్లెట్లు దెబ్బతినాల్సిందేనని, కాళ్లు పట్టుకున్నాడని ఇలా ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశారు. ఇక ఈ ఆరోపణలపై దుల్కర్ సల్మాన్ హైకోర్టులో తన బాధంతా వెళ్ళగక్కారు.నాకు అనవసరంగా మసి పూయాలని చూస్తున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్నానని, దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నానని,బంగారం స్మగ్లింగ్ చేస్తున్నానని ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు అంటూ బాధపడ్డారు. అలాంటి తప్పుడు పనులు నేను చేయను అంటూ దుల్కర్ చాలా బాధతో హైకోర్టులో చెప్పారు. కానీ దుల్కర్ ఎలాంటి వాడో ఇండస్ట్రీకి తెలుసు.ఆయన స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి చిల్లర వార్తలు ఎన్ని వచ్చినా ఆయన భయపడడు. చిల్లర కోసం చిల్లర పనులు చేసే వ్యక్తిత్వం ఆయనది కాదు అంటూ డైరెక్టర్ అలిప్పి అష్రఫ్ దుల్కర్ సల్మాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: