
అయితే ఈ సినిమా ఇప్పటివరకు ఇంకా సెట్స్ మీదకే వెళ్లలేదు. కానీ జాంబిరెడ్డి 2 చిత్రానికి సంబంధించి ఓటిటి బిజినెస్ మాత్రం పూర్తి అయినట్లుగా వినిపిస్తోంది. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకి రూ .42 కోట్ల రూపాయల డీల్ సెట్ అయినట్లుగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పెద్దపెద్ద హీరోల చిత్రాలకే ఓటిటి సంస్థలు ఇంత ధరకు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఇంకా సినిమా షూటింగ్ మొదలు కాకముందే రూ .42 కోట్ల బిజినెస్ ఓటిటి బిజినెస్ జరగడంతో తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
దీంతో తేజ సజ్జా రేంజ్ పెరిగిపోయిందని సినిమాలు విడుదల కాకముందే ఓటిటి డీల్స్ తో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అలాగే హనుమాన్ 2 , మిరాయ్ 2 సినిమాలు కూడా ఉండనున్నాయి. మరి ఈ సినిమాలు కూడా భారీ ధరకే ఓటిటి డీల్స్ పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.