బిగ్ బాస్ షో వారాంతం వచ్చిందంటే చాలు స్టేజ్ పైకి నాగార్జున కనిపిస్తారు. ప్రతి శనివారం నాగార్జున ఎవరికో ఒకరికి క్లాస్ తీసుకుంటూనే ఉంటారు. దీంతో హౌస్ మెట్స్ లో కూడా దడపుడుతుంది. అయితే ఈ వారం కూడా నాగార్జున హౌస్ మెట్స్ కు ఓరేంజ్లో క్లాస్ తీసుకున్నారు. తాజా ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హౌస్ లో కొన్ని బోర్డ్స్ పెట్టి మరి వాటిని ఒక్కొక్కరి మెడలో వేసి అందుకు తగ్గట్టుగా రీజన్ చెప్పాలని తెలిపారు నాగార్జున.


ముందుగా రమ్యను లేపి బోర్డు వేయమన్నారు నాగార్జున, రమ్య నువ్వు వచ్చి ఇంకా వారం రోజులు అయింది. కానీ బిగ్ బాస్ హౌస్ మాత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. నువ్వు అక్కడున్న బోర్డులలో ఒకటి పిక్ చేసుకొని హౌస్ మెట్లో ఎవరికి సరిపోతుందో వారి మెడలో వేసి ఎందుకో చెప్పాలి అంటూ తెలిపారు. ఫేక్ బాండింగ్ అనే బోర్డుని మాధురి మెడలో వేసింది రమ్య. దీంతో హౌస్ లోకి వచ్చిన మొదట్లో ఆమె ఎవరితోనో బాండింగ్ పెట్టుకోని అని చెప్పారు కానీ ఇప్పుడు ఆమె బాండింగ్ పెట్టుకుంది అది కూడా ఫేక్ గా అంటూ తెలిపింది రమ్య. మనసు మార్చుకొని ఉండొచ్చు కదా! అంటూ నాగార్జున అడగగా.. నాకైతే అలా అనిపించిందంటూ తెలిపింది రమ్య.


నాగార్జున కూడా ఎన్నో రకాల ప్రశ్నలను కంటెస్టెంట్లను అడిగారు. ఆ తర్వాత రీతు చౌదరి, మాధురి మెడలో వేయగా.. జుట్టు పట్టుకుని నేలకేసి కొడతా అంటూ చాలానే మాటలు అందని రీతు చౌదరి చెప్పగా.. అందుకు మాధురి నేను బయట ఇలా చేస్తే జుట్టు పట్టుకోని నేలకేసి కొట్టేదాన్ని అంటూ తెలియజేసింది మాధురి. ఈ విషయాల పైన నాగార్జున సీరియస్ అయ్యి మాదిరి ఆఖరి సారి చెబుతున్న.. నేల కేసి కొడతా, తాటతీస్తా, తొక్కుతా అనే పదాలను ఉపయోగించొద్దు.  బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటివి వాడొద్దు అంటూ తెలిపారు. అందుకు సంబంధించి ప్రోమో అయితే వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: