ఇప్పటికే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతోంది — పుష్ప 3 లో అల్లు అర్జున్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపించబోతున్నాడు అని టాక్. ఇది అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోయినా, అభిమానులు మాత్రం ఈ ఊహాగానాన్ని నిజం చేయాలనే ఉత్సాహంతో ఫ్యాన్-మేడ్ వీడియోలు, పోస్టర్లు, కాన్సెప్ట్ ట్రైలర్లు తయారు చేస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో విజయ్ దేవరకొండ లుక్ అదిరిపోయిందని, అచ్చం సుకుమార్ టీమ్ నుంచే లీక్ అయినట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియోలో విజయ్ దేవరకొండ పుష్ప లుక్ కి తగిన రఫ్, రగ్గడ్ స్టైల్ లో కనిపిస్తూ, అల్లు అర్జున్ తో కలసి యాక్షన్ సీన్ చేస్తూ ఉన్నట్లు చూపించారు.
ఈ వీడియో బయటకు రావడంతో కొంతమంది అభిమానులు “ఇది పుష్ప 3 షూటింగ్ లీక్ అయిందేమో” అని అనుకున్నారు. కొంతమంది అయితే “ఇది ఖచ్చితంగా సుకుమార్ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ కేమియో అయి ఉండొచ్చు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కానీ, వాస్తవానికి ఇది అభిమానులే ఎడిట్ చేసిన ఫ్యాన్-మేడ్ వీడియో అని క్లారిటీ వచ్చింది. అయినా వీడియో క్వాలిటీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ అంత రియలిస్టిక్‌గా ఉండడంతో, చాలా మంది దీన్ని నిజమని నమ్మేశారు. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ లుక్, దుస్తులు, యాక్షన్ పోజ్ చూసి ఫ్యాన్స్ “ఏమున్నాడ్రా బాబు! స్క్రీన్ ఫైర్ అవుతుంది!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఫ్యాన్స్ సృష్టించిన కథ ప్రకారం — “పుష్ప 3”లో అల్లు అర్జున్ పోలీసుల చేతికి చిక్కిపోతాడు. ఆ సమయంలో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చే కొత్త క్యారెక్టర్‌గా విజయ్ దేవరకొండ వస్తాడు. అతను ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్ లీడర్‌గా ఉండి, పుష్పను జైలులోనుండి బయటకు తీసుకువస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి జంటగా జరగబోయే యాక్షన్ సీక్వెన్సులు సినిమా మొత్తాన్ని వేరే లెవెల్‌లోకి తీసుకెళ్తాయని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ పై అభిమానులు మేడ్ చేసిన ట్రైలర్ అంత రియలిస్టిక్‌గా ఉండటంతో, సోషల్ మీడియా మొత్తం ఆ వీడియోనే షేర్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లలో #Pushpa3 #VijayInPushpa హ్యాష్‌టాగ్‌లు టాప్ ట్రెండ్స్‌లో నిలుస్తున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా “పుష్ప 3” – “విజయ్ దేవరకొండ లుక్ లీక్” అనే హ్యాష్‌టాగ్‌లతో నిండిపోయింది. ఇది కేవలం ఫ్యాన్స్ క్రియేట్ చేసిన వీడియో అయినా సరే, దాని ప్రభావం మాత్రం నిజమైన సినిమా ట్రైలర్ లా అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ కలిగించింది. ఇదంతా చూస్తుంటే..పుష్ప 3 ఫీవర్ స్టార్ట్ అయ్యింది.. ఫ్యాన్స్ రెడీ అవ్వండి.. అంటున్నారు జనాలు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి