టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. మహేష్ బాబు , పూరి జగన్నాథ్ కాంబోలో మొదటగా పోకిరి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో మహేష్ అభిమానులు మరోసారి మహేష్ మరియు పూరీ జగన్నాథ్ కాంబోలో ఇంకో మూవీ వస్తే బాగుంటుంది అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అలాంటి సమయం లోనే వీరిద్దరి కాంబోలో బిజినెస్ మెన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ తర్వాత మాత్రం వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. వీరిద్దరి కాంబో లో పోకిరి సినిమా కంటే ముందే మరో సినిమా రావాల్సింది.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ రాలేదు. ఇంతకు మహేష్ బాబు , పూరి జగన్నాథ్ కాంబోలో మిస్ అయిన మూవీ ఏది అనుకుంటున్నారా ..? ఆ సినిమా మరేదో కాదు ఇడియట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలో మొదట రవితేజ ను కాకుండా పూరి జగన్నాథ్ , మహేష్ బాబు ను హీరోగా తీసుకోవాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా మహేష్ బాబు ను కలిసి పూరి జగన్నాథ్ కథను కూడా వివరించాడట. కానీ మహేష్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేను అని చెప్పాడట. దానితో రవితేజ తో పూరి జగన్నాథ్ ఆ సినిమాను చేశాడట. అలా పోకిరి కంటే ముందే మహేష్ బాబు , పూరి జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb