- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

రెండేళ్లుగా నిర్మాణంలో గడ్డకట్టుకొని, రిలీజ్ డేట్లు తరచుగా మారి చివరికి వచ్చే ఏడాది మాత్రమే రానున్నట్లు ప్రకటించిన విశ్వాంభర ప్రాజెక్ట్‌ సంగతులు చుట్టూ విమర్శలు, అనిశ్చితి రెండు పెరిగాయి. ప్రచారం ఆలస్యమైనా ఇప్పుడు టీమ్ సైలెంట్ కావడం అభిమానుల్లో సందేహాలు క‌లుగుతున్నాయి. వాస్తవానికి ఇది పూర్తిగా వీఫ్‌ఎక్స్, పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో నాణ్య‌త లేక‌పోవ‌డం, కొత్త గ్రాఫిక్స్ కంపెనీలపై ట్రాన్సిషన్, అలాగే క్వాలిటీ  -కంట్రోల్ ఇవ‌న్నీ ఆల‌స్యం కావ‌డంతో విశ్వంభ‌ర బ‌జ్ పూర్తిగా చ‌ల్ల‌బ‌డిపోయింది. ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వశిష్ట నేతృత్వంలోని యూవీ క్రియేషన్స్‌ ముందు పెద్ద సవాల్ ఉంది.


మ‌రో వైపు విశ్వంభ‌ర బ‌జ్ పూర్తిగా చ‌ల్ల‌బ‌డి పోవ‌డం... ఇటు చిరు - అనిల్ రావిపూడి మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు ప్రాజెక్ట్స్ సెట్స్ మీద‌కు వెళ్ల‌డంతో ఇప్పుడు విశ్వంభ‌ర గురించి మాట్లాడుకునే వారే లేకుండా పోయారు. అస‌లు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ విశ్వంభ‌ర సినిమా మీద పెద్ద‌గా బ‌జ్ లేదు. ఏదేమైనా సంక్రాంతికి చిరు శంక‌రవ‌ర ప్ర‌సాద్ గారు సినిమా వ‌స్తోంది. ఈ సినిమా త‌ర్వాత విశ్వంభ‌ర ప్ర‌మోష‌న్లు మొద‌లు పెడితే త‌ప్పా ఈ సినిమాకు బ‌జ్ వ‌చ్చేలా లేదు. శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా హిట్ అయితే అప్పుడు విశ్వంభ‌ర సినిమా కు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ.. ఇటు ప్రేక్ష‌కుల్లోనూ మంచి హైప్ తో పాటు క్రేజ్ కూడా వ‌స్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: