టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘SSMB 29’ . ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ కెరీర్‌లోనే కాక, భారతీయ సినీ చరిత్రలో కూడా ఈ సినిమా ప్రత్యేక స్థానం సంపాదించబోతోందని సినీ వర్గాల అంచనా. రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా వేరే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు బాగా తెలుసు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఈగ’, ‘మగధీర’ వంటి సినిమాలు ఆయన క్రియేటివిటీకి నిదర్శనం. అటువంటి దర్శకుడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలసి చేస్తున్న సినిమా కాబట్టి, దీనిపై ఉత్సాహం, కుతూహలం సహజం.


అయితే గత కొద్ది వారాలుగా సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. “రాజమౌళి బాహుబలి ప్రమోషన్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. మహేష్ సినిమా వైపు పట్టించుకోవడం లేదు. ‘బాహుబలిని ఇక వదలవా..? శ్శంభ్ 29 గురించి మాట్లాడవా..?’” అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో బాహుబలి ఫ్రాంచైజ్‌ను విస్తరించడానికి వ్యూహాలు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే ఈ వ్యాఖ్యలన్నిటికి సమాధానంగా ఇప్పుడు జక్కన్న – మహేష్ బాబు ఇద్దరూ సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు.



తాజాగా మహేష్ బాబు తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “నవంబర్ వచ్చేసింది… జక్కన్నా, మన ఆరంభం సిద్ధంగా ఉందా..?” అంటూ ఆయన రాసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహేష్ ట్వీట్‌కు కొద్దిసేపటికే స్పందించిన రాజమౌళి కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య స్నేహపూర్వక కేమిస్ట్రీకి ఫిదా అయిపోతున్నారు. ఇద్దరి ట్వీట్లతో సోషల్ మీడియాలో #SSMB29, #MaheshBabu, #Rajamouli  హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం “ఇదే కావాలి, ఇలాగే మా సూపర్ స్టార్జక్కన్న కాంబో రచ్చ చేయాలి” అంటూ ఫీల్ అవుతున్నారు.

 

నిజానికి మహేష్ బాబు సాధారణంగా తన సినిమాల ప్రమోషన్స్‌లో అంతగా పాల్గొనరు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా వేరుగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఆయన చూపిస్తున్న కట్టుదిట్టమైన అటెన్షన్ చూస్తే, సినిమా ఎంత భారీగా తెరకెక్కుతున్నదో అర్థమవుతుంది. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం మహేష్ బాబు ప్రతి షెడ్యూల్‌కి ముందుగానే ప్రిపరేషన్ చేసుకుంటూ, సీన్లపై ప్రత్యేక చర్చలు జరుపుతున్నారు. కేవలం ప్రమోషన్స్ మాత్రమే కాదు..సినిమా కి సంబంధించి ప్రతి విషయంలో అలెర్ట్ గా ఉన్నారు. సినిమాకి 100% న్యాయం చేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలి అంటే జక్కన అనుకున్న దాని కంటే ఎక్కువుగానే మహేశ్ ఉన్నాడు. ఒక్కొ మూమెంట్స్ లో రాజమౌళి కి బిగ్ షాక్ ఇచ్చేస్తున్నాడు మహేష్ బాబు అంటున్నారు అభిమానులు. స్క్రిప్ట్‌ నుండి లొకేషన్‌ ఎంపిక వరకు, విజువల్ లుక్‌ వరకు అన్ని విషయాలపైనా ఆయన జక్కన్నతో క్లోజ్‌గా పనిచేస్తున్నారట. ఇక మరోవైపు, రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఒక సినిమా కాకుండా, భారతీయ సినిమా రేంజ్‌ను మరొకస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా చూస్తున్నారట. ఇండియా, ఆఫ్రికా, యూరప్ వంటి ఖండాల్లో షూటింగ్ జరపాలని ఆయన నిర్ణయించారని తెలుస్తోంది. నవంబర్‌లో ప్రత్యేక టీజర్ లేదా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ అవుతుందనే బలమైన టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏదేమైనా, ఈ నవంబర్ టాలీవుడ్ అభిమానులకు మర్చిపోలేని మంత్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు!



మరింత సమాచారం తెలుసుకోండి: