కొన్ని రోజుల క్రితం కన్నడ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి నటించి , దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఈ సినిమా సౌత్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో అద్భుతమైన స్థానాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ ఏకంగా తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రోబో 2.0 లైఫ్ టైం కలెక్షన్లను కూడా దాటేసింది. రజనీ కాంత్ హీరోగా రూపొందిన రోబో 2.0 సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 709 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక కాంతారా చాప్టర్ 1 మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 827 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి రోబో 2.0 సినిమాను వెనక్కు నెట్టేసింది.

ఇకపోతే సౌత్ మూవీలలో ప్రపంచ వ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో బాహుబలి 2 సినిమా 1810 కోట్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , పుష్ప పార్ట్ 2 మూవీ 1775 కోట్ల కలెక్షన్లతో  రెండవ స్థానంలోనూ , ఆర్ ఆర్ ఆర్ మూవీ 1290 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ 1233 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానం లోనూ , కల్కి 2898 AD సినిమా 1061.50 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ నిలవగా  రిషబ్ శెట్టి హీరోగా నటించి , దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ 827 కోట్ల కలెక్షన్లతో ప్రస్తుతానికి 6 వ స్థానంలో కొనసాగుతుంది. ఈ సినిమా మరికొన్ని కోట్ల కలెక్షన్లను  వసూలు చేసి మరి కొంత ముందు స్థానానికి వెళుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: