మనోజ్ ప్రేమ గురించి తెలియజేస్తూ ఈ ప్రపంచంలో తారతమ్యాలు లేనటువంటిది ప్రేమ ఒక్కటే. అది అందరిది, ప్రేమ పుడితే అలానే ఉంటుంది. రాంబాయి నీ మీద మనసాయే నాకు అనే పాటలో రాజ్యమేది లేదు కానీ రాణి లాగా చూసుకుంటా అన్నట్టు.. నేను కూడా మౌనికకు మాట ఇచ్చాను. అందరూ అనుకున్నట్టుగా నాకు ఎలాంటి రాజ్యాలు లేవు, కానీ నేను ఒక్కడినే ఉన్న ప్రస్తుతానికి సినిమాలు కూడా చేయట్లేదు, కానీ ఖచ్చితంగా మాత్రం మళ్లీ నటించి తీరుతాను కష్టపడతా, జీవితాంతం నిన్ను చాలా బాగా చూసుకుంటాను నన్ను నమ్ముతావా అని అడిగా?!. తను నన్ను అంతలా నమ్మింది. అందుకే నమ్మి వచ్చిన వారి చేయి వదలకండి అంటూ తెలిపారు మనోజ్.
మొత్తానికి మంచు మనోజ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మంచు మనోజ్ ఈ ఏడాది మిరాయి, భైరవం వంటి చిత్రాలలో విలన్ గా అదరగొట్టేశారు. ప్రస్తుతం వాట్ ద ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. గతంలో కూడా ఉస్తాద్ అనే టీవీ షోలో కూడా పోస్ట్ గా వ్యవహరించారు మంచు మనోజ్. నవంబర్ 22వ తేదీన మోహన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఒక వేడుక జరగబోతోంది. మరి ఈ వేడుకకు వస్తారా రారా అనే విషయం తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి