ఈ దర్శక ద్వయం తెరకెక్కించిన తొలి సినిమా 'ఫ్లవర్స్'. ఆ తర్వాత 99', సందీప్ కిషన్‌తో డీ ఫర్ దోపిడి, సైఫ్ అలీఖాన్‌తో 'గో గోవా గాన్', 'హ్యాపీ ఎండింగ్' చిత్రాలు చేశారు. 2019లో వీరు రూపొందించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో వీరు నేషనల్ వైడ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ సీరిస్ మంచి పేరు తెచ్చిపెట్టింది. రాజ్ - సమంత తొలిసారి ఓ పెర్‌ప్యూమ్ యాడ్‌లో కలిసి పరిచయం ఏర్పడగా .. తర్వాత వీరు ఫ్యామిలీమ్యాన్ 2కు కలిసి పనిచేశారు. ఇది 2021లో రిలీజ్ అయ్యింది. సమంత శుభం సినిమాకు రాజ్ నిడుమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న కొంతకాలానికి సమంత, రాజ్ నిడిమోరు కలసి బహిరంగంగానే చెట్టా పట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టేశారు. ఆ తర్వాత వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరిగింది.
ఇక రాజ్ 2015లో రచయిత శ్యామాలిని పెళ్లి చేసుకున్నారు. ఓంకార , రంగ్ దే బసంతి సినిమా లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారామె. ఏడేళ్ల వైవాహిక జీవితం గడిపాక 2022లో ఈ జంట విడాకులు తీసుకుంది. 2010లో విడుదలైన ఏ మాయ చేశావే లో అక్కినేని నాగచైతన్యతో కలసి నటించారు సమంత. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నాక వీరిద్దరు 2017లో పెళ్లి చేసుకుని.. 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2024లో చైతు .. మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడారు. ఇప్పుడు సామ్ .. రాజ్‌ను పెళ్లి చేసుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి