అఖండ2 ప్రీమియర్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు భారీ షాక్ తగిలింది. ఏదో సామెత చెప్పినట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలకు అనుమతులు లభించినా ప్రీమియర్స్ మాత్రం క్యాన్సిల్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. నిర్మాతలు చేసిన తప్పుల వల్ల బాలయ్య అభిమానులు బాధ పడాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొన్నేళ్లలో బాలయ్య నటించిన ఏ సినిమాకు ఇలా జరగలేదని చెప్పవచ్చు.
200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో మేకర్స్ చెత్త ప్లానింగ్ అభిమానుల పాలిట శాపమైంది. భవిష్యత్తులో మరే సినిమా విషయంలో ఇలా జరగకూడదని ఆశిద్దాం. ఇప్పటికే టికెట్లు బుకింగ్ చేసుకున్న అభిమానులకు సైతం ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. వాళ్ళ డబ్బులను రిఫండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ నెల 5వ తేదీన అయినా అఖండ2 మూవీ అనుకున్న విధంగా విడుదలవుతుందా అనే చర్చ జరుగుతోంది. బాలయ్య అభిమానులు మాత్రం ఈ సినిమా నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. 600 రూపాయల టికెట్ రేట్ పెట్టినా సినిమా చూద్దాం అని భావించిన అభిమానులు ప్రీమియర్స్ క్యాన్సిల్ కావడంపై ఫైర్ అవుతున్నారు. గతంలో రవితేజ నటించిన క్రాక్ సినిమాకు రిలీజ్ సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.
బాలయ్య ప్రస్తుతం సినీ నటుడు మాత్రమే కాదు ఎమ్మెల్యే అనే సంగతి తెలిసిందే. రిలీజ్ ముంగిట బాలయ్య సినిమాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురు కావడం అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేసుకున్న అభిమానులు నిర్మాతల రియాక్షన్ తో ఫీలవుతున్నారు. రేపటికైనా అఖండ2 సినిమాకు ఎదురైన ఇబ్బందులు తొలగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి