ఓ పక్క యంగ్ రెబల్ స్టార్ సాహో గ్రాండ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండగా మరో పక్క సైరా నరసింహా రెడ్డి అంటూ అక్టోబర్ 2న మెగాస్టార్ చిరంజీవి గర్జించేందుకు రెడీ అవుతున్నాడు. అసలైతే సాహో సినిమా ఆగష్టు 15 రిలీజ్ అనుకున్నారు కాని అది కాస్త 30కి వాయిదా పడ్డది. సాహో 15న వస్తుందని నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ ఆగష్టు 30న రిలీజ్ ఫిక్స్ చేశారు.


అయితే సాహో డేట్ మారడం వల్ల మరోసారి నాని సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. సెప్టెంబర్ 13న నాని గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవనుంది. అయితే అదేరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న వాల్మీకి సినిమా రిలీజ్ అవుతుంది. జిగుర్తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ గా నటిస్తున్నాడు.


ఇదిలాఉంటే నాని సినిమా మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 13న కాకుండా ఆ తర్వాత వారం అంటే 20వ తారీఖు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంటే సైరాకి సరిగా రెండు వారాలు ముందున్నమాట. తెలియకుండానే సాహో, సైరాల మధ్య నాని హీరోగా వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా నలిగిపోతుంది. నాని మినిమం గ్యారెంటీ హీరోనే అయినా అతని సినిమా పూర్తిగా సేఫ్ జోన్ లోకి రావాలంటే కనీసం రెండు వారాలు టైం కావాలి.   


అలాంటిది ఓ పక్క సాహో మరోపక్క సైరా ఈ రెండు సినిమాలు వచ్చి నాని సినిమాను దెబ్బ తీసేలా ఉన్నాయి. అవి రెండు పెద్ద సినిమాలు కాబట్టి వాటిని ఏమి అనలేని పరిస్థితి. ఇప్పటికి నాని ప్రమోషన్స్ లో సాహో సినిమాపై అది మన సినిమా అనుకుంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఐస్ చేస్తున్నాడు. మొత్తానికి నాని గ్యాంగ్ లీడర్ రిలీజ్ సంక్షోభంలో ఉందని చెప్పొచ్చు. నాని గ్యాంగ్ లీడర్ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి సినిమా ట్రైలర్ 28న రిలీజ్ చేస్తామని అన్నాడు. కార్తికేయ విలన్ గా ప్రియాంకా అరుం మోహన్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: