సినిమా ఇండస్ట్రీలో చాన్స్ రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి.  అలాంటి సినిమాలో చాన్స్ రావడం అంటే అంత సులువైన విషయం కాదు.  ఇండస్ట్రీ పరంగా ఏదైనా బ్యాగ్ గ్రౌండ్ ఉంటే తప్ప స్వయంగా పైకి వచ్చిన వారు చాలా అరుదు అనే చెప్పాలి.  ఈ మద్య తీన్ మార్ అనే ప్రోగ్రామ్ ద్వారా అనూహ్యంగా పాపులర్ అయిన బిత్తిరి సత్తి రెండు రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే.  ఓ వైపు బుల్లితెరపై వస్తూనే సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ వస్తున్నాడు.  అయితే మొదట సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న కోరిక అప్పుడు సాధ్యం కాలేదని తనకు ఈ గుర్తింపు రావడానికి దాదాపు పదిహేను సంవత్సురాలు పట్టిందని బిత్తిరి సత్తి కొన్ని సందర్భాల్లో అన్నారు.  

Image result for bittiri satti

బుల్లితెరపై, వెండి తెరపైనే కాకుండా కొన్ని  ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో కూడా బిత్తిరి సత్తి తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు.  అలాంటి బిత్తిరి సత్తి ఇప్పుడు పూర్తి స్థాయిలో సినీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే తన కెరీర్ ని అనూహ్యంగా మలుపు తిప్పిన ఆ చానల్ ని వదిలిపెడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.   'బిత్తిరి సత్తి' అసలు పేరు చేవెళ్ల రవి .. రంగారెడ్డి జిల్లాకి చెందినవాడు. 'వీ సిక్స్' ఛానల్ లో ప్రసారమవుతోన్న 'తీన్మార్' కార్యక్రమం ద్వారా ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. ఇప్పటికే ఆయనకి సినిమాలలో వరుస ఆఫర్లు వస్తున్నాయట. దాంతో ఈ కార్యక్రమానికి సమయాన్ని కేటాయించడం కష్టమవుతోందట. 

Image result for bittiri satti

ఈ మద్య జబర్ధస్త్ కామెడీ షోతో వేణు, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర లాంటి వారు ఇండస్ట్రీలో కమెడియన్లు గా సెట్ అయ్యారు.  దీంతో ఆ ప్రోగ్రామ్ కి గుడ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది. మరి బిత్తిరి సత్తి పరిస్థితి కూడా సినిమాలో వరుస చాన్స్ లు వస్తే తాను చేస్తున్న ప్రోగ్రామ్ కి గుడ్ బాయ్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో అని బుల్లితెర వర్గం టాక్.  ఏది ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తారు ఎవ్వరైనా.  సినిమా ఇండస్ట్రీ కమెడియన్ గా సెటిల్ అయితే మరి బిత్తరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి తాను చేస్తున్న ప్రోగ్రామ్ కి గుడ్ బాయ్ చెప్పాల్సి వస్తుందా అని అనుమానాలు వస్తున్నాయి. ఈ ప్రచారంలో వాస్తవమెంతనే విషయంలో బిత్తిరి సత్తినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: