అమెరికాలో మన ఇండియన్లు కుమ్మేస్తున్నారు. మరో ఇండియన్ అమెరికన్ తన సత్తా చాటాడు. ప్రతిష్టాత్మకమైన అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇండో అమెరికన్
శాస్త్రవేత్త రతన్ లాల్ ను ఈ ఏడాది వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కృషి చేసిన వారికి ఎక్కువగా ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇస్తుంటారు.
మన ఇండియన్ అమెరికన్ రతన్ లాల్.. సహజ వనరులను పరిరక్షిస్తూ వాతావరణ మార్పులను తట్టుకుంటూ ఆహార ఉత్పత్తిని పెంచడానికి కేంద్రీకృత విధానాన్ని అభివృద్ధి చేశారు. అందుకే ఆయన ఈ ఏడాదికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ అవార్డు కింద రతన్ లాల్ కు రెండు లక్షల యాభైవేల డాలర్ల ప్రైజ్ మనీ అందింది.
అసలు ఇంతకీ ఈ రతన్ లాల్ ఎవరు..? రతన్ లాల్ ఐదుదశాబ్దాల తన కెరీర్ లో ఆహార ఉత్పత్తిని పెంచే దిశగా అనేక పరిశోదనలు చేశారు. ఈయన కృషివలన నాలుగు ఖండాలలోని 500 మిలియన్ ల రైతులకు జీవనోపాధి లభించింది. ఇరవై కోట్ల మంది ప్రజలకు పోషక విలువలు గల ఆహారం అందింది. రట్టన్ లాల్ సూచించిన విధానం ద్వారా కొన్ని వందల మిలియన్ల హెక్టార్లలలో సహజ ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలు సంరక్షించబడ్డాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి