చైనా అనగానే చాలా మంది తల్లి తండ్రులు ఛీ ఛీ అంటున్నారు అని టాక్. చైనాలో మెడిసిన్ విద్య కోసం సహా ఐటి కంపెనీల్లో పని చేయడానికి గానూ కొందరు వెళ్తూ ఉంటారు. కాని ఇప్పుడు అక్కడికి అసలు ఏ మాత్రం వెళ్ళవద్దు అని చెప్తున్నారట తల్లి తండ్రులు. అవసరం అయితే చైనా కాకుండా రష్యా లేదా బ్రిటన్ వెళ్ళాలి అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. బ్రిటన్,జర్మనీ,ఇటలీ తో సహా ఏ యూరప్ దేశం అయినా వెళ్ళాలి గాని చైనా మాత్రం వద్దు అని చెప్తున్నారట. చైనాలో ఉంటే ఎప్పుడు ఏ రోగాలు వస్తాయో తెలియదు అని, అక్కడికి వద్దు అని చెప్తున్నారట తల్లి తండ్రులు.
చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లాలను చైనా నుంచి వచ్చేయాలి అని కూడా కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి. చైనాలో మెడిసిన్ కి మంచి గుర్తింపు ఉంది. అంతే కాకుండా అక్కడి ఫార్మా కంపెనీల్లో మన వాళ్ళు చాలా మంది పని చేస్తూ ఉంటారు. కాని అసలు ఏ మాత్రం కూడా చైనా వద్దు అని తల్లి తండ్రులు స్పష్టంగా చెప్పెస్తున్నారట మరి. కాగా చైనా మరోసారి సరిహద్దుల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి