అయితే మృతుడి తల్లి తన కొడుకు కనిపించడం లేదని 31వ తేదీన మణిపాల్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు భాస్కర్ శెట్టి ని బలి ఇచ్చే ఒక హోమంలో దహనం చేశారు అని తెలుసుకున్నారు. తర్వాత విచారించగా వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయి. భాస్కర్ ని భార్య రాజేశ్వరి శెట్టి, కొడుకు నవనీత్ శెట్టి కలిసి చంపేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరి నిందితులకు నిరంజన్ భట్ అనే ఒక జ్యోతిష్యుడు సహాయం చేశాడు అని తేలింది. దీంతో అతనిపై కూడా పోలీసులు మర్డర్ కేసు ఫైల్ చేశారు. మరొక వ్యక్తి సాక్ష్యాధారాలను మాయం చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు కానీ కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చి వదిలేసింది.
ఇక దోషులుగా తేలిన రాజేశ్వరి శెట్టి, నవనీత్ శెట్టి, నిరంజన్ భట్ లకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాజేశ్వరి శెట్టి బెయిల్ పై మొన్నటి వరకు స్వేచ్ఛగా తిరిగారు కానీ నవనీత్ శెట్టి, నిరంజన్ భట్ లు మాత్రం బెంగళూరు జైల్లో ఉన్నారు. అయితే తాజాగా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో.. వారి శేష జీవితాలు కారాగారానికి పరిమితమయ్యాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి