భారత్‌పై ఉగ్ర సంస్థల దాడిని మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ కేంద్రంగా.. కొన్ని ఉగ్రముఠాలు ఇండియాను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. ఈ విషయాన్ని అమెరికానే స్వయంగా పేర్కొంది. ఉగ్రసంస్థలను కట్టడి చేయడంతో పాకిస్తాన్ నిర్లక్ష్యపు ధోరణిని అవలంభిస్తోందని అమెరికా తాజాగా ఒక నివేదికలో పేర్కొంది. సాజిద్ మీర్, మసూద్ అజర్ వంటి ఉగ్రనేతలు పాకిస్తాన్ స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, అయినా.. వారిని అదుపులో తీసుకోవడంలో పాకిస్తాన్ మొండి వైఖరిని చూపిస్తోందన్నారు.


శుక్రవారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఉగ్రవాదానికి సంబంధించిన 2020 నివేదకను విడుదల చేశారు. ఈ నివేదికలో అఫ్గానిస్తాన్‌ను కేంద్రంగా చేసుకుని అఫ్గాన్ తాలిబన్లు, వాటి అనుబంధ హక్కానీ నెట్‌వర్క్ దాడులు చేస్తూ ఉన్నాయని పేర్కొన్నారు. మరో వైపు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌తోపాటు అనుబంధ సంస్థలు పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, అలా ఇండియాపై ప్లాన్ చేస్తూ దాడులు చేస్తున్నాయని నివేదిక సమర్పించారు. ఈ మేరకు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు పాక్ కోర్టు జైలు శిక్ష విధించిందని పేర్కొంది. అలాగే పాకిస్తాన్‌లోని కొన్ని మదర్సాలలో తీవ్రవాద భావా జాలాన్ని ప్రజల్లో నూరి పోస్తోందని వెల్లడించారు.


అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో దాదాపు 66 మంది భారత సంతతికి చెందిన వారున్నారని పేర్కొంది. అయితే దీనిపై భారత్ తగిన చర్యలు తీసుకుంటోదన్నారు. అంతర్జాతీయ, స్థానిక ఉగ్రవాదులను గుర్తించి.. వారిని నిర్మూలించడంలో ఎన్ఐఏ లాంటి భారత ఉగ్ర వ్యతిరేక దళాల పనితీరు బాగుందన్నారు. ఎయిర్‌పోర్టుల్లో, కార్గోల్లో రెండు తెరల ఎక్స్ రే తెరలను వాడేందుకు ఇండియా అంగీకరించిందన్నారు.


ఈ మేరకు పలు ఒప్పందాల కుదుర్చుకుని ఉగ్రపోరులో భారత్‌తో బలమైన భాగస్వామ్యం పెంచుకుంటున్నామని ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐసిస్‌కు సంబంధించిన 34 కేసులను ఎన్‌ఐఏ విచారణ చేపట్టిందన్నారు. వీరిలో దాదాపు 160 మంది అరెస్టు కాగా.. 10మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లుగా కనుగొన్నట్లు పేర్కొంది. ఉగ్రసమాచారం అందించాలనే యూఎస్‌ అభ్యర్థనకు భారత్‌ సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన విషయమని బ్లింకెన్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదులు అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ ఉండటంపై భారతీయ అధికారులు పెద్ద టాస్కులా మారిందన్నారు. ఈ మేరకు అన్ని దేశాలు ఉగ్ర కట్టడికి కలిసి పనిచేస్తోందని నివేదిక వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: