ప్రపంచంలో చాలా దేశాలు ప్రస్తుతం గోధుమల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని దేశాలలో అయితే కేవలం కొన్ని నెలలకు సరిపడా గోధుమల నిల్వలు మాత్రమే ఉండడం గమనార్హం. ఇక ఈ గోధుమలు సంక్షోభం నుంచి బయట పడేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా దేశాలు. ప్రపంచవ్యాప్తంగా ఇలా గోధుమలు సంక్షోభం ఏర్పడటానికి ముఖ్య కారణం మాత్రం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం  అని చెప్పాలి.


 ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మొదలై దాదాపు వంద రోజులు గడిచి పోయితున్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడ మార్పులు రావడం లేదు. రష్యా అదే రీతిలో ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే కీలక నగరాలను హస్తగతం చేసుకున్న రష్యా పూర్తిగా ఉక్రెయిన్ ను తమ ఆధీనంలోకి  తెచ్చుకోవడమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. ఇలా ఈ రెండు దేశాల మధ్య ఏర్పడిన యుద్ధమే ప్రస్తుతం గోధుమలు సంక్షోభానికి కారణమైంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా గోధుమలను ఎగుమతి చేసే దేశాలు ఈ రెండు మాత్రమే కావడం గమనార్హం.


 రష్యా 17 శాతం గోధుమలను ప్రపంచ దేశాలకు అందజేస్తూ ఉంటే ఉక్రెయిన్ 13% గోధుమలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా ప్రపంచ దేశాలకు 30% గోధుమలను నీకు మతి ఎగుమతి చేస్తూవుంటాయ్ రష్యా ఉక్రెయిన్ దేశాలు. కానీ ఇలాంటి సమయంలోనే రష్యా గోధుమల ఎగుమతులు ప్రారంభించింది . ఉక్రెయిన్ నుంచి మాత్రం గోధుమల ఎగుమతి ప్రారంభం కాలేదు. ఈ ఈ క్రమంలోనే గోధుమల విషయంలో ఇప్పుడు రష్యాని దొంగను చేసి చూపిస్తుంది ఉక్రెయిన్. రష్యా హస్తగతం చేసుకుని నగరాల్లో ఉన్న గోధుమ నిల్వలను రష్యా అమ్ముకోవడం ప్రారంభించింది అంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. అదే సమయంలో మా దాడులలో ధ్వంసం అయిన భవనాలలో ఎక్కడ గోధుమలు ఉన్నాయో అన్న విషయం నాకెలా తెలుస్తుంది అంటూ సమాధానం ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: