కొలరెడో రాకీ మౌంటెన్ నేషనల్ పార్క్ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి వారు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా బతకాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొండలు, అడవుల్లోకి వెళ్లి మనుషులతో సంబంధంలేకుండా జీవించాలనుకున్నారు. కానీ, అక్కడ ఎదురైన అవరోధాలను ఎదుర్కొని నిలవలేక ప్రాణాలే కోల్పోయారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వారిలో ఒకరి కొడుకు కొలరెడోలోని రాకీ పర్వతాల్లో చనిపోయినట్లు అధికారులు తాజాగా గుర్తించారు. రాకీ పర్వతాల్లోని ఒక మారుమూల ప్రదేశంలో క్రిస్టిన్, రెబెక్కా వాన్స్‌లతో పాటు వారి 14 ఏళ్ల కుమారుడి అవశేషాలను ఈ నెలలో గుర్తించారు. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన అనంతరం, వారు ఆకలి వల్ల కానీ శీతాకాలంలో గడ్డకట్టించే చలి కారణంగా కానీ చనిపోయి ఉంటారని నిపుణులు ఓ అంచనాకి వచ్చారు.
ఈ విషయమై రెబెక్కా వాన్స్ సవతి సోదరి ట్రెవలా జారా బుధవారం వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడారు. ''ఈ ప్రపంచం నడుస్తున్న తీరు రెబెక్కాకు అస్సలు నచ్చేది కాదు. ఈ ప్రపంచంతో పాటు అన్నింటికీ దూరంగా తన కుమారుడు, క్రిస్టిన్‌తో కలిసి ఒంటరిగా బతికితే బాగుంటుందని రెబెక్కా ఈ నిర్ణయం తీసుకుంది'' అని జారా చెప్పారు. ఇకపోతే వారికీ అడవిలో బతికిన అనుభవం అస్సలు లేనే లేదు. కొలరెడో పర్వతాల్లో ఎలా జీవించాలో తెలుసుకోవడానికి వారు ఆన్‌లైన్ వీడియోలను చూశారని తెలుస్తోంది. కాగా వారి మరణాలకు కారణం ఇంకా తెలియాల్సి ఉందని పరిశోధకులు అన్నారు. టాక్సికాలజీ నివేదికలు పూర్తిగా వచ్చేవరకు ఆ కారణాన్ని బయటపెట్టబోమని తెలిపారు. నిజంగా దారుణం కదూ!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి