
ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఎన్నో ఘటనలు అటు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. కొన్ని ఘటనలు అయితే అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి కోవలోకి చెందిన ఘటన గురించే. సాధారణంగా మనం లైఫ్ లో ఏదో ఒకసారి చచ్చి బతకడం అనే సామెత వింటూ ఉంటాము. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదంటే ఇంకేదైనా వ్యాధి వచ్చినప్పుడు చావు చివరి అంచుల దాకా వెళ్లి బ్రతికినప్పుడు చచ్చి బతికాం రా బాబు అని అందరూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు.
చావు అంచుల వరకు వెళ్లి మళ్లీ ప్రాణాలతో బయటపడటం చాలా మంది విషయంలో జరుగుతుంది. కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకడం అది కూడా ఏకంగా 24 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రాణాలు రావడం అంటే అది సినిమాల్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటారు అందరు. కానీ ఇక్కడ మాత్రం నిజంగానే జరిగింది. యూఎస్ కు చెందిన రచయిత్రి లారెన్ కెనడి చనిపోయి బ్రతికారు. తీవ్ర గుండెపోటు గురికావడంతో తొమ్మిది రోజులు ఐసియు లో ఉంచి చికిత్స అందించగా గుండె పూర్తిగా కొట్టుకోవడం ఆగిపోవడంతో డాక్టర్లు చనిపోయినట్లు ప్రకటించారు. కానీ 24 నిమిషాల తర్వాత ఆమె గుండె కొట్టుకోవడం మొదలైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇక దీని వైద్యశాస్త్రంలో లాజరస్ ఎఫెక్ట్ అని అంటారట.