ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ రాసారు. 4వ విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు తెదేపా మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారు అని మండిపడ్డారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి బెదిరింపులతో అధికారులు 33 పంచాయతీల్లో తెదేపా మద్దతుదారుల నామినేషన్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు అని ఆయన ఆరోపించారు.

కానీ నేటి వరకు నామినేషన్లు ఎందుకు తిరస్కరించారో రిటర్నింగ్ అధికారులు రాతపూర్వకంగాగానీ, మౌఖికంగాగానీ తెలియజేయలేదు అని చంద్రబాబు నాయుడు లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నామినేషన్లు తిరస్కరించడంతో పోటీ చేసే అభ్యర్థులు అప్పీలు చేసుకునే చట్టబద్దమైన హక్కును కోల్పోతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. శ్రీకాళహస్తిలోని ఎగువ వీధి పంచాయతీలో వై దామోదర్, గందలపూడి పంచాయతీలో బి వరలక్ష్మి, కోదండరామపురం పంచాయతీలో సరిత,

మామిళ్లపూడి పంచాయతీలో శంకరమ్మ, మేలచెరువు పంచాయతీలో సుభాష్, ముచ్చువోలు పంచాయతీలో నర్సయ్య, ఓబులయ్యపల్లె పంచాయతీలో సుబ్రమణ్యంనాయుడు, పాతగుంటపంచాయతీలో లక్షుమమ్మ, రామాపురం పంచాయతీలో మునీంద్ర, సుబ్బనాయుకండ్రిగ పంచాయతీలో శాంతాకుమార్, కొండమానూరు పంచాయతీలో మునుస్వామి, వేదం పంచాయతీలో మునెయ్య, రెడ్డిపాలెం మంచాయతీలో కార్తీక్, జగ్గరాజుపల్లె పంచాయతీలో ముబీనా, ఏర్పేడు మండలంలో ఆది, అంజిమేడు పంచాయతీలో వెంకట్ రెడ్డి,

భండారుపల్లె పంచాయతీలో దామోదర్ రెడ్డి, మునికృష్ణారెడ్డి, గుడ్డిమల్ల పంచాయతీలో వెంకన్నాయుడు, ఇసుకతగేలి పంచాయతీలో శ్రీహంస, మాధవమాల పంచాయతీలో కుమారి, మానసముద్రం పంచాయతీలో భూసమ్మ, మర్రిమందపంచాయతీలో కుసుమాంజలి, నాచనేరి పంచాయతీలో మునెయ్య, పాపానాయుడుపేట పంచాయతీలో శారద, పార్వతీపురం పంచాయతీలో దేవి, పెన్నాగడ్డం పంచాయతీలో మనోహర్ నాయుడు, పల్లాంపంచాయతీలో సుబ్రమణ్యం, కండ్రిగ పంచాయతీలో ధనుంజేయులు,

సీతారాంపేట పంచాయతీలో గురవమ్మ, ఏర్పేడు పంచాయతీలో నిరంజన్, తొట్టంబేడు మండలం గుండెలగూడు పంచాయతీలో భవ్యారెడ్డి, కాంచనపల్లి పంచాయతీలో యల్లమ్మ, చోడవరం పంచాయతీలో చంద్రశేఖర్ రెడ్డిల నామినేషన్లు సక్రమంగా ఉన్నప్పటికి తిరస్కరించారు అని ఆయన అన్నారు. ఏకపక్షంగా భారీగా నామినేసన్లు తిరస్కరించి రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు నాయుడు కోరారు. తెదేపా మద్దతుదారులు వేసిన 33 నామినేషన్లను పరిగణనలోకి తీసుకుని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పచ్ఛపాతంగా జరిగేలా చూడాలి అని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: