యువ ఆటగాడు పృథ్వీ షా కి భారత క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. అయితే కొంత సమయం లోనే యువ ఆటగాడు పృద్వి షా  భారత జట్టు లో స్థానం సంపాదించు కున్నాడు. ఇక మొదట తన కెరీర్లో అద్భుతం గా రాణించిన పృద్వి షా  అందరి ఆకర్షించాడు అన్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత మాత్రం  టీమిండియా జట్టు కు పూర్తిగా దూరం అయి పోయాడు. ఈ క్రమం లో నే గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో కూడా పృద్వి షా పేలవా  ప్రదర్శన చేసే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు.



 అయితే ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా తనను తుది జట్టు నుంచి తప్పించడం విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా ఓపెనర్ బ్యాట్స్మెన్ పృద్వి షా . జట్టులో నుంచి నన్ను  తొలగించారు అని తెలియ గానే ఏకంగా గది లోకి వెళ్లి ఎంతగానో ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.  జట్టు లో లేను అన్న విషయాన్ని తెలియగానే ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాను..నాకు నేనే ఒక పనికిమాలిన వాడి గా కనిపించానని అంటూ చెప్పుకొచ్చారు.



 అయితే గతంలో వరుసగా విఫలమవుతున్న దాన్ని చూసి ఏదో తప్పు జరుగుతుంది అని గ్రహించాను దాన్ని సరి పెట్టు కోవాలి అని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు పృద్వి షా. అయితే ఆస్ట్రేలియా పర్యటన లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న పృద్వి షా  ఆశించిన స్థాయి లో రాణించ లేక పోవడంతో ఇక ఆ తర్వాత జట్టు నుంచి తొలగించారు.  కానీ ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో ప్రదర్శన అదరగొట్టాడు. సెంచరీల సెంచరీలు కొడుతూ తన సత్తా నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: