
ఇప్పటికే శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషేన్ రాజును నియమించారు. ఇప్పుడు తాజాగా.. శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌కు పగ్గాలు అందించారు. ఇది నిజంగా మండలిలో సంచలనమే అని చెప్పాలి. జకియా ఖానమ్ నియామకం.. ఒక రికార్డు. ఇప్పటి వరకు మమైనారిటీ మహిళలకు రాజ్యాంగ బద్ధమైన పదవులు ఏవీ లభించలేదు. కనీసం మంత్రి పదవి కూడా దక్కలేదు.
ఇలాంటి సమయంలో సీఎం జగన్ తీసుకున్ననిర్ణయం సంచలనంగా మారింది. ఫలితంగా ఇప్పటి వరకు మైనారిటీలు.. వైసీపీ వైపే ఉన్నారన్న వాదన.. వారికి జగన్ మేలు చేస్తున్నారన్న ప్రచారానికి బలం చేకూరింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జకియా ఖాన మ్ ను అక్కగా సంబోధించారు. ఒక సాధారణ కుటుంబం నుంచి చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ వైస్ చైర్మన్‌గా ఈ రోజు ఆ స్ధానం లో కూర్చున్నారని కొనియాడారు.
మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలని జగన్ ఆకాంక్షించారు. ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రభుత్వం తోడుగా ఉంటుందని తెలిపా రు. మొత్తానికి సామాజిక సమీకరణల్లోనూ.. వారికి పదవులు ఇస్తున్న విషయంలోనూ.. జగన్ మరో రికార్డును సొంతం చేసుకున్నారనే చెప్పాలి.