ఏపీ సీఎం జగన్ బాబాయ్‌, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య ఘటన విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు విషయంలో సీబీఐ చార్జ్ షీటులో అనేక విషయాలు బయటపెట్టింది. ఎవరు చంపారు.. అందుకు ఎవరు పథకం రచించారన్నది ఇప్పటికే సీబీఐ చార్జ్‌ షీట్‌ ద్వారా వెల్లడైంది. కొన్ని రోజుల క్రితం ఈ చార్జ్‌ షీటు మీడియాలో ప్రముఖంగా రావడంతో వైసీపీ కూడా సీబీఐపై మండిపడిన సంగతి తెలిసిందే.


ఇక ఇప్పుడు ఈ హత్య కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన ఆనాటి సీఐ శంకరయ్య వాంగ్మూలంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. అసలు వివేకా హత్య కేసుపై నమోదు చేయాల్సిన అవసరం లేదని కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో తనతో సీఐ శంకరయ్య తన వాగ్మూలంలో చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. వివేకానందరెడ్డి మృత దేహానికి పోస్టు మార్టం కూడా అవసరం లేదని వారు తనతో చెప్పినట్టు సీఐ శంకరయ్య చెప్పినట్టు తెలుస్తోంది.


హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి పర్యవేక్షణలోనే ఆధారాల ధ్వంసం జరిగిందని సీఐ శంకయ్య చెప్పినట్టు తెలుస్తోంది. వివేకా రక్తపు వాంతులు చేసుకున్నారని.. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందారని మొదట వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి.. తన పీఏ రాఘవరెడ్డి ఫోన్‌ నంబరు నుంచి కాల్‌ చేసి తనతో చెప్పారని సీఐ శంకరయ్య చెబుతున్నారని తెలుస్తోంది.


ఘటనా స్థలంలోని ఆధారాలు ధ్వంసం చేస్తున్నప్పడు వివేకా ఇంటి లోపలికి ఎవరూ  రాకుండా వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి లోపలి నుంచి తలుపులు వేసేశారట. ఆయన స్వయంగా తలుపు వద్దే ఉండి రక్తపు మరకలు శుభ్రం చేసే, గాయాలకు కట్లు, బ్యాండేజీలు వేసే సిబ్బంది మాత్రమే లోపలికి అనుమతించారట. ఆ సమయంలో వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి రెండు, మూడు సార్లు లోపలికి వెళ్లారట. వెళ్లిన కాసేపటి తర్వాత మళ్లీ బయటకు వచ్చారట. ఇప్పటికే చార్జ్ షీటు అవినాశ్ రెడ్డే హత్యకు కారణం అని చెబుతున్న సమయంలో ఈ వాంగ్మూలం దానికి మరింత బలాన్నిచ్చేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: