ఏపీ సీఎం జగన్‌ బతికి ఉండగా.. ఆ సీటును ఎవరూ టచ్ చేయలేరని మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగిస్తూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మాటలను కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ కు వ్యతిరేకంగా 160 సీట్లలో పోటీ చేసే మగాడు ఎవరిని కొడాలి నాని ప్రశ్నించారు. అలాంటి ఒక్క మగాడు ఉన్నా నేను రాజకీయాలు వదిలేస్తా అని కొడాలి నాని సవాల్ విసిరారు.


ఏపీలో ఏ రాజకీయ పార్టీ అయినా 160 సీట్లలో పోటీ చేయగలదా.. అలా చేయించే మగాడు ఉన్నాడా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. అసలు జగన్ బతికుండగా.. సీఎం సీట్ ను టచ్ చేసే మగాడే లేడని మంత్రి కొడాలి నాని చాలెంజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం అన్ని అసెంబ్లీ సీట్లలో సొంత అభ్యర్థులతో పోటీ చేసే సత్తా ఒక్క వైసీపీకి మాత్రమే ఉందన్నారు. వైసీపీ  మినహా మరే ఇతర పార్టీకి కూడా ఆ సత్తా  లేదని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు.


ఏపీలో మొత్తం అసెంబ్లీ  సీట్లు 175 అయితే.. అందులో 160 సీట్లకు కూడా సొంతంగా పోటీ చేసే సత్తా ఏ పార్టీకి కూడా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఏపీలో ఒకే సారి 160 సీట్లకు పోటీ చేసే సత్తా ఏ ప్రతిపక్ష పార్టీకి లేదని..  గుంపులుగా పందుల తరహాలో అంతా కలిసి 175 సీట్లు పంచుకోవాల్సిందేనని మంత్రి కొడాలి నాని  ఎద్దేవా చేశారు. అంతే కాదు.. కమ్మలు.. జగన్ కు వర్గ శత్రువు అంటున్న పవన్ కళ్యాణ్... కాపులు చంద్రబాబును సీఎం చేయాలని అంటాడని  కొడాలి నాని గుర్తు చేశారు.


ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన సారా మరణాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి కొడాలి నాని అంటున్నారు. సాధారణ మరణాలను కూడా మద్యం మరణాలుగావిపక్షాలు  చిత్రీకరిస్తున్నాయని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. సీఎం జగన్‌పై బురదచల్లాలని ప్రయత్నిస్తున్నారని.. జగన్ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలని చూస్తే.. చంద్రబాబు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మంత్రి కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: