ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయి అన్నది ఎవ్వరూ ఊహించలేకున్నారు. ఒక్కోసారి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉందని ప్రముఖులు తమ అభిప్రాయాలూ తెలియచేస్తుంటే ? ఇంకోసారి వైసీపీని ఢీ కొట్టే పార్టీనే లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏపీలో జరగనున్న 2024 ఎన్నికలలో ఏ పార్టీ విజయకేతనాన్ని ఎగురవేయనుంది అన్నది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేము. ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉండగా అప్పుడే ఎన్నికల ఫలితాలను బేరీజు వేయడం సాధ్యపడదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులలో అత్యంత అపారమైన అనుభవం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు.

కానీ 2014 లో విజయం సాధించిన పిదప చంద్రబాబు పాలన చేసిన తీరు ఏపీ ప్రజలను ఆకట్టుకోకపోవడమే.. ఆ తర్వాత ఎన్నికల్లో యువనాయకుడి చేతిలో చావుదెబ్బ లాంటి ఫలితాలు వచ్చాయి. ఇక వచ్చిన అవకాశాన్ని వైసీపీ రెండు చేతులా అందిపుచ్చుకుంది. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ దాదాపుగా నెరవేర్చి ప్రజల మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ వైపు ప్రజలు పాజిటివ్ గానే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అపరమేధావి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పార్టీని గెలిపించి మళ్ళీ సీఎం పీఠాన్ని అధిరోహించగలడా అన్న ప్రశ్నకు సమాధానం కాదనే వినిపిస్తోంది.

ఇక ఇటీవల కర్నూల్ పర్యటనలో ఎన్నికల గురించి ప్రజలతో తన బాధను పంచుకున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే... జగన్ పై కాస్తో కూస్తో కొన్ని జిల్లాలలో అసంతృప్తి ఉంది. అయితే ఈ అసంతృప్తి టీడీపీని గెలిపించలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవేళ ప్రజలు గెలిపించాలనుకున్నా చంద్రబబు తర్వాత బలమైన నాయకత్వం లేకపోవడం కూడా పెద్ద మైనస్ గా చెప్పాలి. ఇలా వివిధ పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే చంద్రబబు పొలిటికల్ ఎగ్జిట్ కు వేళాయె అనాల్సిందే.    


మరింత సమాచారం తెలుసుకోండి: