తమిళనాడు లో గత కొంత కాలంగా రాజకీయంగా ఎన్నో కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి మొదలు ఆమె మరణించిన తర్వాత ముఖ్యమంత్రి సీటు కోసం జరిగిన అంతఃకలహాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.  ఇక పన్నీరు సెల్వం వర్సెస్ శశికళ మద్య జరిగిన రాజకీయ చదరంగంలో లాభపడింది మాత్రం పళనిస్వామి.  ప్రస్తుతం తమిళనాడు సీఎం పీఠాన్ని పళనిస్వామి అధిష్టించిన సంగతి తెలిసిందే.  
Image result for merina beach
తాజాగా తమిళనాడులో మరో వివాదాస్పద సంఘటనకు తెరలేచింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధిని మెరీనా బీచ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది.  ఈ మద్య అమ్మ సమాధి వద్ద మణిమండపాన్ని నిర్మించనున్నట్టుగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.  
Image result for sasikala panneerselvam
దీనిని వ్యతిరేకిస్తూ..ఇది ముమ్మాటికి నిబంధనలకు విరుద్ధం అని, అసలు జయలలిత సమాధే అక్కడ ఉండటానికి వీల్లేదని.. అది నిబంధనలకు విరుద్ధమని ఒక న్యాయవాది చెన్నై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.  ప్రస్తుతం ఈ కేసు విచారణకు వచ్చింది. అంతే కాదు తమిళనాడు ప్రజలు ఎంతగానో ఆరాధించే అన్నాదురై, ఎంజీ రామచంద్రన్‌ వంటి మహానుభావుడి సమాధి పక్కన అక్రమాస్తుల కేసులో నేరారోపణ ఎదుర్కొన్న జయలలిత సమాధి నిర్మాణం సరికాదని పిటిషనర్‌ వాదించారు.  

అంతే కాదు మెరీనా బీచ్ తీరం నుంచి 500 అడుగుల్లో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టకూడదని పర్యావరణ శాఖ నిషేధాజ్ఞలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కారణాలు చూపిస్తూ..నిర్మాణ పనులపై నిషేధం విధించి జయ మృతదేహాన్ని బీచ్‌ నుంచి తొలగించేలా ఆదేశించాలని పిటిషనర్‌ వాదించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: