దివంగత తమిళ ముఖ్యమంత్రి జయ లలిత చనిపోయిన దగ్గర నుంచీ తమిళనాట భారీ రాజకీయ అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే. శోభన్ బాబు - జయలలిత లకి అప్పట్లో ప్రేమ వ్యవహారం నడిచింది అనీ ఇద్దరూ మధ్యనా ఏదో ఉండేది అంటూ మీడియా లో చాలా సంవత్సరాల క్రితమే వార్తలు వచ్చాయి.


ఇప్పుడు తాజాగా వారిద్దరికీ నేనే కూతురు అనీ శోభన్ బాబు- జయలలిత ల ప్రేమ కి తానే తీపి గుర్తుని అంటూ అమృత అనే మహిళ తమిళనాట సంచలనం రేపుతోంది. కావాలంటే డీఎన్ఏ పరీక్షలు కూడా చేయించుకోవాలి అని ఆమె కోరుతోంది. సీబీఐ దర్యాప్తు కి అయినా తాను సిద్దం అని ఆమె సవాల్ చేసింది.


రాష్ట్రపతి కోవింద్ కీ ప్రధాని మోడీ కీ ఆమె ఈ మేరకు లేఖలు కూడా రాసింది " మాజీ ముఖ్యమంత్రి జయలలిత నన్ను కన్నా తల్లి. తల్లి తండ్రులని కోల్పోయిన బాధలో ఉన్న జయలలిత శోభన్ బాబు కి దగ్గర అయ్యింది.


వారిద్దరి మధ్యనా తక్కువ టైం లోనే ప్రేమ పుట్టింది. పెళ్లి చేసుకోవడం కుదరని వారిద్దరూ నన్ను కానీ జయ సోదరి శైలజ, భర్త సారథిలకు అప్పగించారు. అయితే నేను ఎవరన్న విషయం ఎవరికీ చెప్పొద్దని వారితో ఒట్టు వేయించుకున్నారు. 1996లో శైలజ సూచన మేరకు జయను కలిస్తే వివరాలు తెలుకుని నన్ను ఒక్కసారిగా హత్తుకున్నారు. అయితే ఆమె నా తల్లి అన్న విషయాన్ని ఆమె ఎప్పుడూ చెప్పలేదు’’ అని లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: