తృణమూల్ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కుమార్ కు లైన్ క్లియర్ అయ్యింది.  జెడియు ఉపాధ్యక్షుడిగా  ఉన్న ప్రశాంత్ కుమార్.. తృణముల్ కాంగ్రెస్ కు ఎలా పనిచేస్తారని కొందరు ప్రశ్నించారు.  జెడియు సమావేశం ఆదివారం రోజున జరిగింది.  ఈ సమావేశంలో అనేక విషయాలు ప్రస్తావన కు వచ్చాయి.  


బిజినెస్ వేరు.. రాజకీయం వేరు అని, బిజినెస్ అన్నది  ఎవరితోజైనా చేసుకోచ్చని నితీష్ కుమార్ అన్నారు.  బీహార్ రాష్ట్రంలో మాత్రమే పొత్తు ఉంటుందని, మిగతా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో జెడియు తప్పకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.  


ఈ విషయంపై ప్రశాంత్ కుమార్ ఈరోజు మాట్లాడబోతున్నారు.  జెడియు లైన్ క్లియర్ చేసిన తరువాత ప్రశాంత్ నిర్ణయం ఏంటి అనే దాన్ని ఆయన ప్రకటించనున్నారు.  తృణమూల్ తో కలిసి ఎన్నికల్లో పనిచేస్తారా లేదంటే దాన్ని పక్కన పెడతారా అన్నది ఈరోజుతో తేలిపోతుంది.  


ఇప్పుడు అందరి చూపులు ప్రశాంత్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి.  మరి అయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.  ఒకవేళ ప్రశాంత్ కిషోర్ తృణమూల్ తో కలిసి పనిచేస్తే బీజేపీ ఎలా  అవుతుందో అది కూడా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: