మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే కోడెల ఆత్మహత్య వార్త బయటకు వచ్చినా ఐదారు గంటల వరకూ చంద్రబాబు స్పందించలేదు. ప్రముఖలంతా సంతాపాలు తెలిపినా బాబు నుంచి వార్తలేదు. ఇలా ఎందుకు జరిగిందో వైసీపీ నాయకులు చెబుతున్నారు.


కోడెల ఆత్మహత్య లేఖ ఏమైనా రాశారేమోనని చంద్రబాబు భయపడిపోయారని వైసీపీ మంత్రి కొడాలి నాని అంటున్నారు. కోడె ఆత్మహత్య తర్వాత చంద్రబాబు ఎక్కడ ఆయన సూసైడ్ లైఖ రాశారో.. అందులో ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించారో అని భయపడ్డారని నాని పేర్కొన్నారు. అయితే ఎలాంటి లేఖ లేదని తెలంగాణ పోలీసులు చెప్పడంతో.. ఆ తర్వాత బయటకు వచ్చి శవరాజకీయం చేస్తున్నారని నాని మండిపడ్డారు.


తెలంగాణ పోలీసులు విచారణ చేస్తే చంద్రబాబు దోషి అని తేలుతుందని కొడాలి నాని అంటున్నారు. కోడెల కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తి మాదిరి మరో పదిరోజులు నటిస్తారని, చంద్రబాబు వల్లే కోడెల చనిపోయారని వారు చెప్పకుండా మేనేజ్ చేసే పనిలో ఉన్నారని కొడాలి నాని అన్నారు. శివప్రసాదరావు కేసులో చంద్రబాబు పాత్రపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రబాబును చేర్చాలని కొడాలి నాని కోరారు.


పది రోజులుగా కోడెలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మూడు రోజుల క్రితం గుంటూరులో చంద్రబాబు మీటింగ్‌ పెట్టిన మాట వాస్తవమా.. కాదా సమాధానం చెప్పాలన్నారు. కోడెల శివప్రసాదరావుపై ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదని, ఆయన, ఆయన కుమారుడు, కూతురు బాధితులు ముందుకు వచ్చి కేసులు పెట్టారన్నారు. అయినా పోలీసులు ఇప్పటి వరకు కోడెలకు నోటీసులు కూడా ఇవ్వలేదని, కనీసం విచారణకు హాజరుకావాలని కూడా కోరలేదన్నారు. శవ రాజకీయాలు చేసేందుకు ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నాడని కొడాలి నాని మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: