పోలవరం రివర్స్ టెండర్ల అంశం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఒక్క పోలవరం టెండర్‌ లోనే దాదాపు 782 కోట్లు ఆదా అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. రివర్స్ టెండరింగ్ పై మొదట్లో విమర్శలు గుప్పించినా.. ఆ తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక విచిత్రమైన విమర్శలు చేస్తోంది. పోలవరం టెండర్లలో వచ్చిన నష్టాలను వేరే చోట కాంపన్సేట్ చేస్తానని జగన్ హామీ ఇచ్చి ఉంటాడని కొత్త ఆరోపణలు చేస్తోంది.


అంటే పరోక్షంగా రివర్స్ టెండరింగ్ విధానం సక్సస్ అయ్యిందని టీడీపీ నేతలే ఒప్పుకుంటున్నారన్నమాట. ఇప్పుడు జనం కూడా ఆలోచిస్తున్నారు. ఒక్క టెండర్లోనే దాదాపు 800 కోట్లు ఆదా అయితే గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు హాయంలో చంద్రబాబు, లోకేశ్ ఎంత వెనకేసు ఉంటారోనని లెక్కలు వేసుకుంటున్నారట. ఈమాట కూడా మంత్రి అనిల్ చెప్పారు.


వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామన్న అనిల్.. ప్రతి పనిపై కూడా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని తెలిపారు. గత పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం కూడా ఇలాగే పారదర్శకంగా పనులు చేపట్టి ఉంటే రాష్ట్రానికి వేల కోట్ల ప్రజాధనం మిగిలేదన్నారు. దోచుకున్న డబ్బు పెద్దబాబు, చిన్నబాబు జేబుల్లోకి వెళ్లాయా అని ప్రశ్నించారు. ఎక్కడైనా ప్రభుత్వం రూ.10 తగ్గించి, పారదర్శకంగా పనులు చేపడితే మెచ్చుకోవాల్సి పోయి..విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మ్యాక్స్‌ సంస్థకు పోలవరం నిర్మించే అర్హత లేదని టీడీపీ నేతలు అంటున్నారని, అదే గత ప్రభుత్వంలో ఇదే మ్యాక్స్‌ సంస్థకు 4.45 శాతానికి ఎక్సెస్‌కు అప్పగించలేదా అని ప్రశ్నించారు. పోలవరానికి సంబంధించి మెఘా 12.5 శాతం తక్కువకు పనులు చేపట్టేందుకు ముందుకు వస్తే తప్పుపడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఇవన్నీ జీర్జించుకోలేక ప్రభుత్వంపై బుదర జల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. మరి నిజమే కదా.. ఒక్క టెండర్లోనే 800 కోట్లు మిగిలితే.. గత ఐదేళ్లలో ఎన్ని కోట్లు పక్కదారి పట్టాయో..?


మరింత సమాచారం తెలుసుకోండి: