రోజురోజుకూ పసివాళ్లపై వేధింపులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి సెక్సువల్ హెరాస్ మెంట్ బాగా పెరుగుతోంది. మొన్నటికి మొన్న వరంగల్ లో ఓ కామ పిశాచి.. నెలల పసిగుడ్డుపై అత్యాచారం చేశాడు.. ఈ కేసును పోలీసులు వేగంగా విచారణ చేశారు. కోర్టులు కూడా స్పెషల్ గా తీసుకుని వెంటనే శిక్ష వేశారు.


ఉభయగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాల్లో పోస్కో చట్టం కింద వందకు పైగా కేసులు పెండింగ్ ఉన్నాయి. దీంతో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోస్కో చట్టం కింద నమోదు అయిన కేసుల సత్వర విచారణకు కొత్తగా 8 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.


అందుకే ఏపీలో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించి పోస్కో చట్టం కింద నమోదు అయిన కేసులను సత్వరం విచారణ చేసేందుకు వీలుగా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.


చిత్తూరు , తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 13 జిల్లాలకు గానూ 8 జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కోంది.బాలలపై లైంగిక వేధింపుల కేసుల విచారణకు పోస్కో చట్టం 2012 ప్రకారం ఈ కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


సమాజంలో పెరుగుతున్న పెడ ధోరణులు ఈ లైంగిక వేధింపులకు దారి తీస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. పిల్లలను తెలిసిన వారే నూటికి 80 శాతం వరకూ లైంగికంగా వేధిస్తున్నారట. అందుకే చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ప్రైవేటు పార్టులు ఎవరూ తాకకూడదని అర్థమయ్యేలా చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: